Sly Rat : జిత్తులమారి ఎలుక!
ABN , First Publish Date - 2023-03-08T00:03:36+05:30 IST
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ జిత్తులమారి ఎలుక ఉండేది. దానికి స్వార్థమెక్కువ. తనెలా ఉండాలో అలానే ఉండేది. ఎవరినీ నమ్మేది కాదు. ఒక రోజు ఉదయాన్నే
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ జిత్తులమారి ఎలుక ఉండేది. దానికి స్వార్థమెక్కువ. తనెలా ఉండాలో అలానే ఉండేది. ఎవరినీ నమ్మేది కాదు. ఒక రోజు ఉదయాన్నే ఆహారంకోసం బయటకు బయలుదేరింది. బయటకు వచ్చేప్పుడు ఒక్కసారి పైకి చూసింది. ఎదురుగా పిల్లి నక్కినట్లు నిలబడి ఎదురుచూస్తోంది. ఏం చేయాలో ఎలుకకు అర్థం కాలేదు. కాసేపు ఆలోచించింది. కొద్దిసేపటి తర్వాత దానికో ఆలోచన వచ్చింది. బయటకు వెళ్తే పిల్లి తినేస్తుంది. ఇంట్లో ఉంటే ఆకలితో చస్తాను. ఎలాగైనా సరే బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
కొద్దిసేపు బొరియలోనే అటూ ఇటూ తిరిగింది. వెంటనే ఆ బొరియల్లో ఉండే తన పక్కింటి ఎలుక దగ్గరకు వెళ్లింది. అదో అమాయకత్వం ఎలుక. జిత్తులమారి ఎలుక ‘నీకో బహుమతి’ అన్నది. వెంటనే అమాయక ఎలుక ‘ఏమిటో?’ అని అడిగింది. మన దగ్గరలో మొక్కజొన్న చేను చూశా. వెళ్దామా? అన్నది. అమాయకం ఎలుక సంతోషపడింది. వెంటనే ‘వెళ్లు అయితే’ అన్నది. ‘అక్కడికి వెళ్లాలంటే ఒక్కదాన్ని కష్టం. పైగా ఒంటరిగా తినటం సిగ్గుగా ఉంటుంది. పది మందిలో కలసి ఆహారం తింటేనే నాకు సంతోషం’ అన్నది. అమాయకం ఎలుక సంతోషపడింది.. తన మిత్రుడి మనసు చూసి. వెంటనే జిత్తులమారి ఎలుక ‘నువ్వు ముందు వెళ్లు. నాయకుడివి నువ్వు. నీ వెనకాల నడుస్తా. నాకు భయం’ అంటూ పొగిడింది. అమాయకత్వం ఎలుక ముందడుగేసింది. బొరియనుంచి వేగంగా బయటికి వచ్చింది. బయట పొంచి ఉన్న పిల్లి ఆ ఎలుకను పట్టుకుంది. క్షణాల్లో అమాయకత్వం ఎలుక పిల్లి నోటికి ఆహారమైంది. పనిలో పనిగా జిత్తులమారి ఎలుక ఇంకో పక్కనుంచి ఆహారం కోసం పరిగెత్తింది.