UAE: ఎమిరేట్స్‌లో కొత్త చట్టం.. జనవరి 1వ తారీఖు నుంచి అమలు..
ABN , First Publish Date - 2023-10-06T13:11:41+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 2024 జనవరి 1వ తారీఖు నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది.
రాస్ అల్ ఖైమా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 2024 జనవరి 1వ తారీఖు నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా ఎమిరేట్ పరిధిలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌పై బ్యాన్ విధిస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (Environment Protection and Development Authority) బుధవారం ఈ కొత్త చట్టం విధివిధానాలను వివరించడం జరిగింది. ఇది 2023 ప్రారంభంలో ప్రకటించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-use Plastics)పై పాన్-యూఏఈ బ్లాంకెట్ బ్యాన్‌కు అనుగుణంగా వస్తుందని పేర్కొంది.
సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రాస్ అల్ ఖైమా పాలకుడు హిజ్ హైనెస్ షేక్ సౌద్ బిన్ షకర్ అల్ ఖాసీమీ (His Highness Sheikh Saud bin Saqr Al Qasimi) 2023లో జారీ చేసిన చట్టం నం. 04 ప్రకారం ఈ ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్‌ను 2024 జనవరి 1 నుంచి ఎమిరేట్‌లో నిషేధించడం జరుగుతుంది. ఇక అబుదాబిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై 2022 జూన్ 1వ తారీఖు నుంచి బ్యాన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే దుబాయిలో 2022 జూలై 1 నుంచి, షార్జాలో 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది.