CBN CID Enquiry : ఇంకా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబు.. ఎన్ని ప్రశ్నలు అడిగారంటే.. విచారణ మధ్యలో..!?
ABN , First Publish Date - 2023-09-09T22:16:53+05:30 IST
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) సీఐడీ అధికారులు (CID Officers) విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా చంద్రబాబు (CBN CID Enquiry) విచారణ సాగుతోంది...
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) సీఐడీ అధికారులు (CID Officers) విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా చంద్రబాబు (CBN CID Enquiry) విచారణ సాగుతోంది. అయితే ఎన్ని గంటలకు విచారణ అయిపోతుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ముందుగానే సిద్ధం చేసిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సీఐడీ అధికారులు సమాధానాలు రాబడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబును 21 పైగా ప్రశ్నలను సీఐడీ అధికారులు అడిగినట్లు తెలియవచ్చింది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ సమక్షంలోనే చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. సిట్ (SIT) విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్నారు. మరికాసేపట్లో న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) విచారణ మధ్యలో చంద్రబాబును కలవలనున్నారు. తాను ఆయన్ను కలవాలని సీఐడీ అధికారులను అడగ్గా చంద్రబాబుకు అనుమతించారు.
ఏం జరుగుతోంది..?
శనివారం తెల్లవారుజామున నుంచి ఏపీ రాజకీయాల్లో హైటెన్షనే నెలకొంది. నంద్యాలలో ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేయడం.. ఆయన్ను అరెస్ట్ చేయనివ్వమని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, అటు నుంచి విజయవాడకు తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించడం.. దారి పొడవునా ఎక్కడ చూసినా బాబును తీసుకెళ్లనివ్వమని టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు సైతం ఆందోళనలు, నిరసనడం దిగడంతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికింది. మధ్యాహ్నం భోజనం కూడా చంద్రబాబు మార్గమధ్యలోనే చేయాల్సి వచ్చింది. అటు తిప్పి.. ఇటు తిప్పి హైటెన్షన్ మధ్యే విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును అధికారులు తీసుకొచ్చారు. సుమారు నాలుగున్నర గంటలుగా చంద్రబాబుపై సీఐడి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉండటంతో.. ఎప్పుడు అయిపోతుందనే దానిపై క్లారిటీ లేదు. దీంతో విచారణలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. బాబు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారో అని టీడీపీ శ్రేణులు సీఐడీ కార్యాలయం ఎదుట వేచి చూస్తున్నాయి.
ఇంత దారుణమా..?
సీఐడీ సిట్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులపై పోలీసులు జాలి, దయ లేకుండా వ్యవహరిస్తున్నారు. జోరున వర్షం కురుస్తుండటంతో సమీపంలోని పందిరిలో టీడీపీ శ్రేణులు తలదాచుకున్నాయి. అయితే ఆ శ్రేణులను నిర్దాక్షిణ్యంగా పోలీసులు రోడ్డుపైకి బలవంతంగా పంపేస్తున్న పరిస్థితి. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమేం సీఐడీ ఆఫీసులోకి చొరబడట్లేదు కదా..? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..? ఇక్కడేమైనా నిరసన చేపట్టడం లేదు కదా..? అని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో సిట్ కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లయ్యింది. ఓ వైపు సీఐడీ కార్యాలయంలో ఏం జరుగుతోందో తెలియక టెన్షన్‌లో టీడీపీ శ్రేణులు ఉంటే.. ఇలా పోలీసులు దురుసుగా ప్రవర్తించడమేంటి.. ఖాకీలు ఇంత దారుణంగా ఉన్నారేంటి..? ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.