YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న రెండ్రోజులకే ఆదాలకు ఊహించని షాక్.. అరెరె ఇలా జరిగిందేంటి..!
ABN , First Publish Date - 2023-02-06T21:35:34+05:30 IST
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే..
అమరావతి/నెల్లూరు : నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే అధికార వైసీపీలో (YSR Congress) మరోసారి వర్గవిబేధాలు బయటపడ్డాయి. రూరల్ ఇంఛార్జ్‌గా (Rural Incharge) ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి (MP Adala Prabhakr reddy) అధిష్టానం బాధ్యతలు అప్పగించిన రెండ్రోజులకే ఆయనకు ఊహించని రీతిలో వైసీపీ నేతలు (YSRCP Leaders), కార్యకర్తలు షాకిచ్చారు. మొట్టమొదటి ర్యాలీ కావడం.. అందులోనూ స్వాగత ర్యాలీ కావడంతో ఇలా జరిగిందేంటి..? అని అటు అధిష్టానం (High Command) ఇటు జిల్లా నాయకత్వం ఆలోచనలో పడిందట. ఇంతకీ ఏం జరిగింది..? రెండ్రోజులకే వర్గవిబేధాలు ఎందుకొచ్చాయి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..
వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అసమ్మతి గళం వినిపించడం, వెనువెంటనే ఆయన్ను హైకమాండ్ పిలిపించి క్లాస్ తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చివరికి పార్టీని వీడటంతో ఆ ఎపిసోడ్‌కు (Kotamreddy Episode) అక్కడితో ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత రూరల్‌కు ఇంఛార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచే ఆదాల పోటీచేస్తారని కూడా వైసీపీ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి ఇంఛార్జ్ (Incharge) రేసులో ఈయన పేరు అస్సలు లేదు.. కానీ సడన్‌గా ఎందుకు వచ్చిందో.. అధిష్టానానికి ఈ ఐడియా (Idea) ఎవరిచ్చారో తెలియక.. కోటంరెడ్డి తర్వాత ఆ సీటు ఆశించిన నేతలు ఆలోచనలో పడ్డారు. అవన్నీ ఇప్పుడిక్కడ అప్రస్తుతమే.
అరెరే.. రెండ్రోజులకే ఇలానా..!
ఆదాలకు రూరల్ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించాక ఫస్ట్ టైమ్ నియోజకవర్గానికి విచ్చేశారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ (Grand Welcome) పలకాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఎన్నెన్నో అనుకున్నారు. అయితే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఆదాల రానే వచ్చారు కానీ.. స్వాగత ర్యాలీలో విబేధాలు బయటపడ్డాయి. ర్యాలీలో ఆదాలకు సంబంధించిన వారు మాత్రమే పాల్గొన్నారు కానీ.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (MLA Anil Kumar Yadav) అనుచరులు, నెల్లూరు సిటీకి (Nellore City) చెందిన వైసీపీ శ్రేణులు పాల్గొనలేదు. దీంతో బాధ్యతలు అప్పగించాక ఫస్ట్ టైమ్ వస్తే ఇలా జరిగిందేంటి..? అని ఆదాల ప్రభాకర్ (Adala Prabhakar) ఆలోచనలో పడ్డారట. మరోవైపు.. ఈ వ్యవహారం హైకమాండ్‌కు చేరడంతో అసలేం జరిగిందని ఆరా తీసిందని కూడా టాక్ నడుస్తోంది.
కారణం ఇదేనా..!
చాలా రోజులుగా అనిల్ కుమార్‌కు.. ఆయన బాబాయ్ రూప్ కుమార్‌కు (Roop Kumar) మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా అనిల్ అనుచరులు పాల్గొంటే రూప్‌కుమార్ వర్గం పాల్గొనకూడదని.. రూప్ వర్గం వెళితే అనిల్ అనుచరులు వెళ్లకూడదని అనుకున్నారట. ఈ ఇద్దరి మధ్య విబేధాలతో ఆదాలకు హ్యాండ్ ఇచ్చారట. మరోవైపు.. అనిల్ కుమార్‌కు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రికి కూడా అస్సలు పడట్లేదని.. ఇప్పుడు ఆదాల విషయంలోనూ ఇదే జరుగుతోందనే టాక్ కూడా నడుస్తోంది. రూరల్‌లో ఆదాల చాలా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే.. ఆదాలకు మొదట్లోనే నేతలు, కార్యకర్తలు ఇలా షాకులిస్తుంటే.. రేపొద్దున ఎన్నికల్లో పోటీచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో పైనున్న పెరుమాళ్లకే తెలియాలి మరి.
ఇవి కూడా చదవండి..
YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..
*************************************
YSRCP : వైసీపీకి షాకిచ్చిన కీలక నేత.. రాజీనామా చేసి టీడీపీలో చేరిక.. అసలేం జరిగిందంటే..
*************************************
Ponguleti : అభిమానుల సాక్షిగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి.. అంతా సరే కానీ..!
*************************************