Challa Family Dispute : నాడు వన్‌మ్యాన్ ఆర్మీ.. నేడు ఒకే ఒక్క గొడవతో ‘చల్లా’ చెదురైన కుటుంబం.. అసలెందుకీ పరిస్థితి..!?

ABN , First Publish Date - 2023-04-01T21:06:11+05:30 IST

రాయలసీమ రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డి (Challa Ramakrishna Reddy) కుటుంబానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన మరణాంతరం చల్లా కుటుంబంలో ఒక్కసారిగా..

Challa Family Dispute : నాడు వన్‌మ్యాన్ ఆర్మీ.. నేడు ఒకే ఒక్క గొడవతో ‘చల్లా’ చెదురైన కుటుంబం.. అసలెందుకీ పరిస్థితి..!?

రాయలసీమ రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డి (Challa Ramakrishna Reddy) కుటుంబానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన మరణాంతరం చల్లా కుటుంబంలో ఒక్కసారిగా వర్గపోరు మొదలైంది. చల్లా చిన్న కుమారుడు భగీరథరెడ్డి (Challa Bhageerath Reddy) మరణాంతరం విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. వారసత్వం కోసం, ఆస్తుల కోసం కుటుంబ సభ్యులే రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు. ఈ గొడవలతో చల్లా కుటుంబం (Challa Family) చెల్లాచెదురైంది. చల్లా ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం..

Challa-Ramakrishna-Reddy.jpg

అసలేం జరిగింది..?

దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నువ్వా నేనా.. అన్నట్లుగా చల్లా పెద్ద కుమారుడు చల్లా విగ్నేశ్వర్ రెడ్డికి.. చిన్న కుమారుడి సతీమణి చల్లా శ్రీలక్ష్మి (Challa Srilakshmi) మధ్య వార్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన చల్లా శ్రీలక్ష్మి.. విగ్నేశ్వర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడి పోవడం, గొడవలకు దిగడం తీవ్ర చర్చనీయాంశ మైంది. చల్లా సీమ పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్సీ పదవిలో ఉండగా చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరిలోఅనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవిని చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కూడా 2022 నవంబర్‌లో ఆకస్మికంగా మరణించారు. నాటి నుంచి చల్లా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. చల్లా భగీరథరెడ్డి సతీమణి, అవుకు జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి ఒక వర్గంగా.. చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి (Challa Sridevi), పెద్ద కుమారుడు విగ్నేశ్వర్ రెడ్డి (Challa Vigneswar Reddy) , చల్లా సోదరులు కలిసి మరో వర్గంగా విడిపోయారు. చల్లా వారసత్వం విషయంలో రెండు వర్గాల మధ్య ఆరు నెలల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లా కుటుంబం నుంచి రెండు వర్గాల వారు టికెట్ ఆశించారు. అయితే సీఎం జగన్ ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో చల్లా కుటుంబానికి నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే చల్లా శ్రీలక్ష్మి ఇంటికెదురుగా పార్టీ కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించారు. మరోవైపు.. చల్లా విగ్నేశ్వర రెడ్డి కూడా పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఆ సందర్భంలోనే చల్లా రాజకీయ వారసుడు విగ్నేశ్వర రెడ్డి అని చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి.. కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి చల్లా శ్రీలక్ష్మి వెళ్లలేదు.

Jagan-at-Challa.jpg

రచ్చకు దారితీసింది ఇదే..!

ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లోనే చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం కోసం ఇరువర్గాలవారు గొడవపడ్డారు. ఆ సమయంలో చల్లా భార్య శ్రీదేవిని, కోడలు శ్రీలక్ష్మీ తీవ్ర పదజాలంతో దూషించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరుసటి రోజు ఉదయం చల్లా శ్రీదేవి, విఘ్నేశ్వర్ రెడ్డి.. శ్రీలక్ష్మి పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. విషయం తెలుసుకున్న చల్లా శ్రీలక్ష్మి అక్కడికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో రామకృష్ణారెడ్డి అక్క కుమారుడు రవీంద్రనాథ్ రెడ్డి తనను కాలితో తన్నాడని చల్లా శ్రీలక్ష్మి ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో శ్రీలక్ష్మీ వర్గీయులు అక్కడికి రావడంతో రెండు వర్గాల వారు పిడిగుద్దు లతో బాహాబాహికి దిగారు. విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి (MLC Rama Subbareddy) , బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (MLA Katasani Rami Reddy) చల్లా ఇంటికి వచ్చి పంచాయితీ చేశారు. ఇంతకుముందు కూడా చల్లా శ్రీలక్ష్మి సీఎం జగన్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్ళబోసుకున్నారు. చల్లా శ్రీలక్ష్మికి భద్రతగా 3 + 3 గన్‌మెన్‌లను ప్రభుత్వం కేటాయించింది. అయితే.. పోలీసులు, గన్‌మెన్‌ల ఎదుటే గురువారం చల్లా శ్రీ లక్ష్మీపై దాడి జరగటం గమనార్హం. రెండు వర్గాలకు చెందిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Challa-Sridevi-Jagan.jpg

శ్రీదేవి అలా.. శ్రీలక్ష్మి ఇలా..!

తన భర్త చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం తన ఇంట్లోనే ఉండాలని చల్లా శ్రీదేవి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆ ఫొటోను ఇతరులు ఉంచుకునే అధికారం లేదని.. చల్లా చిత్రపటాన్ని తాకే అర్హత లేదన్నారు. తన భర్త, చిన్న కుమారుడు భగీరథ్‌రెడ్డి మరణం తర్వాత తనకు ఇంట్లో కనీస రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోతున్నారు. మరోవైపు.. శ్రీలక్ష్మి స్పందిస్తూ.. గొడవలు సృష్టించి తమను గ్రామం నుంచి వెలివేసేందుకు చల్లా రామకృష్ణారెడ్డి సభ్యులు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి తనను కాలితో తన్ని అసభ్యపదజాలంతో దూషించారన్నారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇంటిని వదలి వెళ్లే ప్రసక్తే లేదని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు.

Sridevi-with-Jagan.jpg

చల్లా రేంజ్ ఇదీ..!

చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ స్టైలే వేరు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన వన్‌మ్యాన్ ఆర్మీగా.. ఫ్యాక్షన్ లీడర్‌గా సాగారు. ఆయన బతికున్నంత కాలం చల్లా కుటుంబంలో చిన్నపాటి గొడవ కూడా జరగలేదు. కానీ చల్లా రామకృష్ణారెడ్డి మరణాంతరం కుటుంబంలోని వారే రెండు వర్గాలుగా విడిపోయి ఆస్తి కోసం చిల్లరగా కొట్టుకోవడం ఏమిటని చల్లా అభిమానులు అసహ్యించుకుంటున్నారు. ఈ సమయంలోనే చల్లా ఆస్తులపై శ్రీలక్ష్మి, విగ్నేశ్వరరెడ్డిల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన భర్త భగీరథరెడ్డి, తన పేరు మీద ఉన్న షేర్లను.. అత్త, పృథ్వీరెడ్డి కలసి వారి పేరు మీద మార్చుకున్నారని చల్లా శ్రీలక్ష్మీ ఆరోపించారు. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని వారు చల్లా వారసులేనని వారి ఆస్తికోసం పోరాడుతున్నానని.. దీనిని జీర్ణించుకోలేక తమపై దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చల్లా శ్రీలక్ష్మి ఆందోళన చెందుతున్నారు.

Challa-F.jpg

ఎప్పుడు ‘చల్లా’రుతుందో..!

అయితే.. శ్రీలక్ష్మి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి ఆస్తులను వారే అక్రమంగా తీసుకున్నారని తాము డైరెక్టర్ల పర్మిషన్ షేర్స్ తమ పేరు మీద మార్చుకున్నామని విగ్నేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు. తమ తండ్రి ఆస్తి అందరికీ సమానంగా చెందాలని విగ్నేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఏదో ఒక కారణంతో చల్లా కుటుంబంలో జరుగుతున్న గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎపిసోడ్‌కు ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందోనని చల్లా అభిమానుల్లో, వైసీపీ నాయకులు వేచి చూస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో వైఎస్ జగన్ కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని జిల్లా నేతలు కోరుకుంటున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో ఎప్పుడు ఈ మంటలు ‘చల్లా’రుతాయో చూడాలి మరి.

Challa-Sridevi.jpg

******************************

ఇవి కూడా చదవండి

******************************

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

******************************

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

******************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

******************************

YS Jagan House : బాబోయ్.. పేరుకేమో రూపాయి సీఎం వైఎస్ జగన్.. ఈ విషయంగానీ మీకు తెలిసిందో..!

******************************
YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

******************************

Updated Date - 2023-04-01T22:26:01+05:30 IST