Share News

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ

ABN , Publish Date - Oct 19 , 2024 | 12:41 PM

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

Bandi Sanjay: గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ
bandi sanjay

హైదరాబాద్: గ్రూప్-1 బాధితులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులను కలిసేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు. హాస్టల్లలో చదువుకుంటున్న తమను బయటకు లాక్కొచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తే... మాపై నక్సల్స్ అని ముద్ర వేసి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


బాధితులకు ఫుల్ సపోర్ట్..

రాముడి వనవాసం మాదిరిగా 12 ఏళ్లపాటు పరీక్షల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. తెలుగు అకాడమీ సిలబస్ కూడా చదవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని వాపోయారు.

ఎలాగైన తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు బండి సంజయ్ ను వేడుకున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా బండి సంజయ్ తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ సైతం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.


కావాలనే 29 జీవో తెచ్చింది..

అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకోవాలని.. న్యాయం జరిగే వరకు బీజేపీ బాధితుల కోసం పోరాడుతుందని హామీ ఇచ్చారు. ’’నేను కేంద్ర మంత్రినైనా... మీకోసం రోడ్డెక్కుతున్న. జీతాలిచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే కావాలనే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి గ్రూప్-1 పరీక్షలు వాయిదా పడేలా చేస్తోంది. అందులో భాగంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా 29 జీవోను జారీ చేసింది‘‘ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 19 , 2024 | 01:02 PM