NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో వైఎస్ జగన్ అహం చల్లారిందా.. జీ-20 సమ్మిట్ తర్వాత ఏం జరగబోతోంది..!?
ABN , First Publish Date - 2023-09-09T18:18:37+05:30 IST
హెడ్డింగ్ చూడగానే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు (Chandrababu Arrest) .. ప్రతిష్టాత్మకంగా భారత్‌లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit) ఏమిటి సంబంధం అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదా. అవును మీరు వింటున్నది నిజమే.. సంబంధం ఉంది.!..
హెడ్డింగ్ చూడగానే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు (Chandrababu Arrest) .. ప్రతిష్టాత్మకంగా భారత్‌లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit) ఏమిటి సంబంధం అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదా. అవును మీరు వింటున్నది నిజమే.. సంబంధం ఉంది.! అదెలాగనే విషయం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరుగుతోంది..?
చంద్రబాబు అరెస్ట్‌ను (NCBN Arrest) సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రంగాల పెద్దలు.. పలు పార్టీల పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన అరెస్ట్ అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు, మరికొందరు మీడియాతో మాట్లాడుతూ బాబు అరెస్ట్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, టీడీపీ డైహార్డ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం (AP Govt) తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ కూడా.!. అయితే.. ఈ పరిస్థితుల్లో సడన్‌గా జీ-20 సమావేశాల ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు అంతా బిజిబిజీగా గడుపుతున్నారు. కనీసం ఫోన్లు చేస్తే ఎత్తే పరిస్థితిలో ఉన్నారు. దీంతో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఇతర పెద్దలకు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తీరును వివరిస్తూ.. ప్రభుత్వం చేస్తోంది అంతా కక్ష సాధింపేనని ఈ కేసులపై టీడీపీ పెద్దలు లేఖలు రాశారు. అయితే.. కేంద్రంలోని పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జీ-20 సమ్మిట్ తర్వాత నేరుగా టీడీపీ పెద్దలు కొందరు నేరుగా కలవబోతున్నారు. మరోవైపు.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే కేంద్రంలోని పెద్దలకు లేఖలు రాశారు. జీ-20 హడావుడి తగ్గాక నేరుగా వెళ్లి కలిసి వివరిస్తానని మీడియాకు వెల్లడించారు.
సినిమా అప్పుడేనేమో..?
చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ అహం చల్లారి ఉండొచ్చేమో కానీ.. జీ-20 సమ్మిట్ తర్వాత అసలు సినిమా ప్రారంభం కాబోతోందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న హోం మంత్రి అమిత్ షా.. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. సమావేశాలు తర్వాత నేరుగా జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఎందుకు సృష్టిస్తున్నారు..? శాంతి భద్రతలకు ఎందుకింతలా విఘాతం కలిగిస్తున్నారు..? ప్రత్యర్థులు అనేవారు లేకుండా చేయాలన్నది మీ ఉద్దేశ్యమా..? అని జగన్‌కు గట్టిగానే అమిత్ షా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. అంటే.. ఇప్పుడు ప్రారంభం అంతే.. అదేదే అంటారే ముందుంది.... పండుగ అన్నట్లు అన్న మాట. బహుశా ఇటు సమ్మిట్ అయిపోవడం.. అటు జగన్ లండన్ పర్యటన (Jagan Landon Tour) అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి అన్న మాట. ఏం జరుగుతుందనే దానిపై అటు టీడీపీలో (Telugudesam).. ఇటు వైసీపీలోనూ (YSR Congress) సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అహం చల్లార్చుకోవడానికేనా..?
వాస్తవానికి చంద్రబాబుపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం, ఏదో ఒకవిధంగా ఆయన్ను బద్నాం చేయాలని ఎప్పట్నుంచో జరుగుతున్నదే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇప్పటి సీఎం వైఎస్ జగన్ (CM Jagan) వరకూ లెక్కలేనన్ని కేసులే పెట్టారు. అయితే ఇంతవరకూ ఒక్కటంటే ఒక్కటి రుజువైన దాఖలాల్లేవ్. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నిప్పులాగా వాటన్నింటినీ ఎదుర్కొన్నారు.. పెద్ద పెద్ద వాళ్లే ఏమీ చేయలేకపోయారు. ఇంతవరకూ అవినీతి మరకలేని చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు.. చేయబోరు అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ కక్షగట్టి అదికూడా అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి..? అనేది కనీసం తెలియకుండానే ఇలా రివెంజ్ రాజకీయాలు చేయడాన్ని యావత్ తెలుగు ప్రజలు ఖండిస్తూ.. ప్రభుత్వం తీరుపై కన్నెర్రజేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చంద్రబాబును వైఎస్ జగన్ వెంటాడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడా ఏ ఒక్కటీ జగన్‌కు దొరక్కపోవడంతో.. ఇప్పుడు స్కిల్ డెలప్మెంట్‌లో లేనిపోని అవినీతి ఆరోపణలు అన్నీ సృష్టించి ఇలా కక్ష తీర్చుకుంటారనేది తాజా పరిస్థితులతో అక్షరాలా నిజమయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యర్థులను ఎలాగోలా ఒక్కసారైనా అరెస్ట్ చేయాలనే జగన్ అహం చల్లారిందని మరోవైపు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా.. అరెస్ట్ తర్వాత చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తీసుకెళ్లిన తీరు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళనలతో రాష్ట్ర అట్టుడికిపోతోంది. చంద్రబాబుకు మద్దుతుగా ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. సో.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. కాలమే సమాధానం చెబుతుంది జగన్.. కాస్త ఓపిక పట్టాలంతేనని తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేస్తున్నారు.