Valentines Day: పార్కులో కూర్చున్న భార్యాభర్తలు.. ప్రేమికులేమోనని భావించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు.. చివరకు ఊహించని సీన్..!
ABN , First Publish Date - 2023-02-15T16:37:55+05:30 IST
ఫిబ్రవరి 14న ప్రేమికుల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకునే వారు కొందరైతే.. అప్పటికే ప్రేమలో ఉన్న వారు.. ప్రేమికుల రోజున సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో పార్కులు మొత్తం ప్రేమికులతో నిండిపోతుంటాయి. అయితే..
ఫిబ్రవరి 14న ప్రేమికుల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకునే వారు కొందరైతే.. అప్పటికే ప్రేమలో ఉన్న వారు.. ప్రేమికుల రోజున సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో పార్కులు మొత్తం ప్రేమికులతో నిండిపోతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రేమికులకు భజరంగ్ దళ్ కార్యకర్తల రూపంలో సమస్యలు ఎదురవుతుంటాయి. వారిని చూడగానే ప్రేమ జంటలు పారిపోవడం కూడా తరచూ చూస్తుంటాం.
ఇదిలావుండగా, హర్యానాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికుల రోజున పార్కులో కూర్చున్న భార్యాభర్తలను భజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరించారు. చివరకు ఏం జరిగిందంటే..
హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ఎన్‌ఐటీ-3 టికోనా పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 14 (February 14) మంగళవారం ప్రేమికుల రోజు (Valentines Day) కావడంతో ఆ పార్కు మొత్తం ప్రేమ జంటలతో సందడి సందడిగా ఉంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు భజరంగ్‌దళ కార్యకర్తలు టక్కున వాలిపోయి.. ప్రేమికులకు పెళ్లిళ్లు చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే ఈ పార్కులోకి కూడా కొందరు యువకులు ప్రవేశించి, తాము భజరంగ్ దళ్ కార్యకర్తలం (Bajrang Dal activists) అంటూ అందరినీ బెదిరించడం మొదలెట్టారు. ఈ క్రమంలో అక్కడే కూర్చున్న దంపతుల (couple) వద్దకు కూడా వెళ్లారు. తాము భార్యాభర్తలమంటూ వారు ఎంత చెబుతున్నా.. యువకులు మాత్రం వినిపించుకోలేదు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో చివరికి మహిళ గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని భజరంగ్ దళ్ కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు.
అంతా ఒకేసారి దాడికి (attack) దిగడంతో సదరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు మాట్లాడుతూ 112కు (Police Helpline Number) ఫోన్ చేసినా, పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. దాడి గురించి తమకు సమాచారం అందిందని చెప్పారు. అయితే అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ముందుకు వస్తే.. విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, బాధిత భార్యాభర్తలు.. ఫరీదాబాద్‌లోని ఎస్‌జీఎం నగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral photos and videos) అవుతున్నాయి. భజరంగ్ దళ్ పేరుతో దౌర్జన్యం చేసే ఇలాంటి వారికి.. ఇలాగే బుద్ధి చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.