Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!
ABN , First Publish Date - 2023-11-26T22:01:08+05:30 IST
పగటి పూట రైలు ప్రయాణాలు చేసేవారు ట్రైన్ టైం కంటే రెండు గంటలకు మించి ముందుగా స్టేషన్ రాకూడదు. రాత్రి సమయాల్లో ఈ కాలపరిమితి ఆరు గంటలుగా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: సామాన్యులకు అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ప్రయాణ సాధనం రైలే! దీనికి తోడు ప్రజావసరాలకు సరిపడా రైలు సర్వీసులు లేకపోవడంతో స్టేషన్లు నిత్యం రద్దీగా ఉంటాయి. అయితే, ప్రయాణికులకు వీలైనంత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వే శాఖ(Indian Railways) పలు నిబంధనలు(Rules and Regulations) రూపొందించింది. వీటిని అతిక్రమిస్తే జరిమానాతో పాటూ ఇతర శిక్షలు విధించేందుకూ రైల్వే శాఖకు అధికారముంది.
Viral: అసలైన లక్ అంటే ఇదే..ఒక్క తప్పుతో లైఫ్ టైం బంపర్ లాటరీ.. ఎంతొచ్చిందో తెలిస్తే..
సాధారణంగా రైలు టిక్కెట్(Train Ticket) ఉన్న వారికి ప్లాట్‌ఫాం టిక్కెట్టు(Platform Ticket) అవసరం లేదని అనుకుంటూ ఉంటాం. అది కొంత వరకూ నిజమే కానీ ఈ విషయంలో రైల్వే శాఖ చాలా స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.
Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!
పగటి పూట బయలుదేరే రైళ్ల టిక్కెట్ కొనుక్కున్న వారు ప్రయాణసమయానికి రెండు గంటల కంటే ముందే వచ్చేందుకు అనుమతి లేదు. అలాగే రాత్రి పూట రైలుకు సంబంధించి టిక్కెట్ కొనుక్కున్నవారు ఆరు గంటలకు మించి ముందుగా స్టేషన్‌కు రాకూడదు. అయితే, రైలు లేటైన సమయాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. ప్రయాణ సమయం కంటే ముందుగా వచ్చి, గంటలు గంటలు స్టేషన్‌లో గడిపేసే ప్రయాణికులతో సమస్య రాకూడదని ఈ తరహా నిబంధన రూపొందించారు.
Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!
రైలు టిక్కెట్ పరిమితికి మించి అధిక సమయం స్టేషన్‌లో ఉండాలనుకునే వారు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టిక్కెట్ కొనసాలని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి.
Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!