ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్: రూ. 10 నుంచి రూ. 2000 నోట్ల రంగుల చీరల కలెక్షన్ ఆమె సొంతం!
ABN , First Publish Date - 2023-02-01T07:54:10+05:30 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందమైన చీరల సేకరణకు పెట్టిందిపేరు. ఆమె కట్టుకునే చీరల రంగులు దేశంలోని కరెన్సీ రంగులను పోలివుంటాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్ల రంగులను పోలివుండే చీరలను కట్టుకుని ఆమె పలు సందర్భాలలో కనిపిస్తుంటారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందమైన చీరల సేకరణకు పెట్టిందిపేరు. ఆమె కట్టుకునే చీరల రంగులు దేశంలోని కరెన్సీ రంగులను పోలివుంటాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్ల రంగులను పోలివుండే చీరలను కట్టుకుని ఆమె పలు సందర్భాలలో కనిపిస్తుంటారు. అయితే ఈ రోజు ఆమె 2023-24 బడ్జెట్‌ను ఏ రంగు చీరతో వచ్చి సమర్పిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. నిర్మల వ్యక్తిత్వం ఆమె కట్టుకునే చేనేత, పట్టు చీరలలో ప్రతిబింబిస్తుంటుంది. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించారు. ప్రత్యేక సందర్భాలలో ఆమె ఎక్కువగా సంబల్‌పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంటారు. కానీ ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారు. నిర్మలా సీతారామన్ ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తారు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆమె దుస్తులలో పెద్దగా మార్పులు చేయలేదు. చీర కట్టుకుని, ఆమె సాధారణ భారతీయ గృహిణుల వలె కనిపిస్తుంటారు.
నిర్మలా సీతారామన్ 17 డిసెంబర్ 2022న ఢిల్లీలోని జన్‌పథ్‌లో చేనేత హాత్‌ను సందర్శించి, చీరల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సౌత్ సిల్క్ చీర కట్టుకుని కనిపించారు. ఆమె ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆర్థిక మంత్రి కట్టుకునే చీరల రంగులు భారత కరెన్సీతో ఎలా మ్యాచ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.
అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర..
2019 జనవరి 30న, అమరవీరుల దినోత్సవం నాడు, నిర్మలా సీతారామన్ రాజ్‌ఘాట్‌లో క్రీమ్ కలర్ మోడ్రాంగ్ ఫై ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన మణిపురి చీరను కట్టుకున్నారు. మణిపూర్‌లోని మోయిరాంగ్ గ్రామంలో 'మొయిరాంగ్‌ఫీజిన్' డిజైన్‌తో చీరను రూపొందించారు.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర..
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మల 20 రూపాయల నోటు రంగు చీరలో కనిపించారు. అది ఆకుపచ్చ రంగులోని మంగళగిరి సాధారణ కాటన్ చీర. ఈ చీరలు ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యాయి.
విలేకరుల సమావేశంలో నిర్మల కట్టుకున్న జమ్దానీ చీర రూ.50 నోటుతో పోలిక..
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నీలం రంగు జమ్దానీ చీర ధరించి కనిపించారు. నిర్మల కట్టుకున్న చీరలు చాలావరకూ నీలిరంగులో ఉంటాయి.
రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్‌పురి చీరలో నిర్మల..
సీతారామన్ అనేక సందర్భాల్లో లిలక్ చీరను కట్టుకున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆమె ఒక్కసారి మాత్రమే 100 రూపాయల నోటు రంగు కలిగిన సంబల్‌పురి (ఒడిశా) ఇకత్ చీరను కట్టుకున్నారు.
రూ.200 నోటు రంగు చీరలో మన్మోహన్ సింగ్‌తో భేటీ
ఆర్థిక మంత్రి అయిన తర్వాత నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను ఆరెంజ్ కలర్ కాటన్ చీరలో కలిశారు.
ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర...
అక్టోబర్ 2022లో, నిర్మల అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడి జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సమావేశంలో, ఆమె బూడిద రంగు (జహర్మురహర) దక్షిణ కాటన్ చీరను కట్టుకున్నారు.
రూ. 2000 నోటు రంగుతో సరిపోలే సౌత్ సిల్క్ చీరలో...
నిర్మలా సీతారామన్ తన ఢిల్లీ నివాసం వెలుపల రూ. 2000 నోటుతో సరిపోలే లావెండర్ కలర్ సౌత్ సిల్క్ చీరను కట్టుకుని కనిపించారు.