Special Trains: చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:51 AM
చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

చెన్నై: ప్రయాణికుల సౌకర్యార్ధం ముంబై - చెన్నై సెంట్ర(Mumbai- Chennai Central)ల మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకారం, నెం.01015 ముంబై - చెన్నై సెంట్రల్ వారాంతపు ప్రత్యేక రైలు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో ముంబైలో అర్ధరాత్రి 12.20 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11.30 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Dy CM: డిప్యూటీ సీఎం ఉదయనిధికి అస్వస్థత
మరుమార్గంలో, నెం.01016 చెన్నై సెంట్రల్-ముంబై వారాంతపు ప్రత్యేక రైలు చెన్నై సెంట్రల్ నుంచి ఏప్రిల్ 10,17,24,మే 1 తేదీల్లో తెల్లవారుజామున 4 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటలకు ముంబై చేరుకుంటుంది. ఈ రైళ్లు పెరంబూర్, అరక్కోణం, రేణిగుంట(Renigunta), రాజంపేట, కడప మీదుగా వెళ్లనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News