MegaPrinceVarunTej: కొత్త సినిమా పేరు గాండీవధారి అర్జున

ABN , First Publish Date - 2023-01-19T12:07:42+05:30 IST

వరుణ్ తేజ్(Varun Tej), ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru)తో చేస్తున్న సినిమా టైటిల్ ఈరోజు అంటే జనవరి 19, వరుణ్ తేజ్ పుట్టిన రోజు (#HBDVarunTej) సందర్భంగా 'గాండీవధారి అర్జున' (#GandeevadhariArjuna) అని ప్రకటించారు.

MegaPrinceVarunTej: కొత్త సినిమా పేరు గాండీవధారి అర్జున

వరుణ్ తేజ్(Varun Tej), ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru)తో చేస్తున్న సినిమా టైటిల్ ఈరోజు అంటే జనవరి 19, వరుణ్ తేజ్ పుట్టిన రోజు (#HBDVarunTej) సందర్భంగా 'గాండీవధారి అర్జున' (#GandeevadhariArjuna) అని ప్రకటించారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత కాగా ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ మొదటి సారిగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఇంతకు ముందు కొన్ని సినిమాలు 'గరుడవేగ' (Garudavega), 'ఘోస్ట్' (Ghost), యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చేసిన సినిమాలే, అందులోనూ అవి కొంచెం గూఢచారి, నేషనల్ సెక్యూరిటీ లాంటి సబ్జెక్టు తీసుకొని చేసినవి. ఈ వరుణ్ తేజ్ సినిమా కూడా చాలా మట్టుకు యాక్షన్ తో కూడుకున్నది అని ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది.

varun-tej3.jpg

అలాగే ఈ సినిమా పేరు 'గాండీవధారి అర్జున' అంటే, అర్జునుడు మంచి విలుకాడు, అపజయమెరుగని వీరుడు. అదీ కాకుండా, శత్రువులు ఎన్ని వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి జయం పొందిన వీరుడు. గాండీవం చేతిలో ఉంటే అర్జునుడు ని ఎవరూ ఆపలేరు కూడా, అందుకని ఈ చిత్రం లో వరుణ్ తేజ్ కూడా అలంటి ధీరోదాత్తమయిన పాత్ర పోషిస్తూ ఉండాలి అని తెలుస్తోంది. ఇది ఒక గూఢచారి, స్పై లాంటి సినిమాగా అనిపిస్తోంది. ఎదో మిషన్ మీద వరుణ్ తేజ్ వెళ్లి ఎలా విజయుడు అయి తిరిగి వచ్చాడు అనే కధాంశం తో కూడుకున్నది అయి ఉండాలని, ఈ పోస్టర్, సినిమా టైటిల్ బట్టి తెలుస్తోంది.

ఈ సినిమా చాల భాగం బ్రిటన్ (Most of the shooting happened London)లో చిత్రీకరించినట్టు గా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఎక్కువ అక్కడే చిత్రీకరించినట్టు, మామూలుగా నిర్మాత ప్రసాద్ తన చిత్రాలన్నీ షూటింగ్ బ్రిటన్ లో పెట్టుకుంటారు అందుకవల్ల ఇది కూడా చాలా భాగం అక్కడే తీశారు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. వరుణ్ తేజ్ ఇందులో తన ముందు సినిమాలలో వేసిన పాత్రల కంటే భిన్నంగా కనపడుతున్నాడు. ఇది పూర్తి యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు ఇలాంటి యాక్షన్ సినిమాలు చెయ్యటంలో మంచి పేరు తెచ్చుకున్నాడు, అందుకని ఇందులో కూడా వరుణ్ తేజ్ ని బాగా చూపిస్తాడని అనుకుంటున్నారు. మికీ జె మేయర్ దీనికి సంగీతం సమకూర్చారు. (MickeyJ Meyer)

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-01-19T23:02:57+05:30 IST

News Hub