Health Tips: ఎండ లేకపోయినా సరే.. విటమిన్ డి ని పొందవచ్చు.. అందుకోసం ఇలా చేయండి..
ABN , First Publish Date - 2023-09-12T15:28:33+05:30 IST
సూర్యరశ్మి నుండి లభించే విటమిన్-డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్-డి లోపిస్తే కండరాల నొప్పి, ఎముకలు పెళుసుబారడం, డిప్రెషన్, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని అధిగమించాలంటే..
సూర్యుడు భగభగ మండుతుంటే తిట్టుకుంటాం కానీ ఆ సూర్యరశ్మి లేకపోతే ఎన్ని సమస్యలొస్తాయో. ముఖ్యంగా సూర్యరశ్మి నుండి లభించే విటమిన్-డి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్-డి లోపిస్తే కండరాల నొప్పి, ఎముకలు పెళుసుబారడం, డిప్రెషన్, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. కానీ బుతువు మారడం వల్ల ఆకాశం అంతా మబ్బులు పట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి జాడ ఉండదు. ఇలాంటి సమయంలో విటమిన్-డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగానే ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజుల్లో బద్దకంగా అనిపిస్తుంటుంది. దీర్ఘకాలం సూర్యుని ఎండ సోకకుండా ఉంటే పైన చెప్పుకున్న జబ్బులన్నీ చాపకింద నీరులా శరీరంలో చేరతాయి. అలా జరగకుండా ఉంటాలంటే విటమిన్-డి ని ఆహారం నుండి పొందాలి. ఏయే ఆహారాలలో విటమిన్-డి(Vitamin-D rich Foods) పుష్కలంగా ఉంటుందో తెలుసుకుంటే..
పుట్టగొడుగులు..(mushroom)
ఇప్పట్లో పుట్టగొడుగులు సూపర్ మార్కెట్లలో చాలా విరివిగా దొరుకుతున్నాయి. పుట్టగొడుగుల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. వీటిని శాండ్విచ్ ల దగ్గరనుండి కూరల వరకు నచ్చినట్టు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. తద్వారా శరీరానికి కావలసిన విటమిన్-డి పొందవచ్చు.
Health Tips: రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
గుడ్లు..(Eggs)
పేదవారి నుండి ధనవంతుల వరకు ప్రోటీన్ కోసం ఎక్కువగా తినేవి గుడ్లు. ఇవి పిల్లలకు పెద్దలకు కూడా సిఫార్సు చేయబడతాయి. గుడ్లలో కూడా విటమిన్-డి ఉంటుంది. గుడ్లలో ఉండే పసుపు భాగాన్ని వదలకుండా తినడం ద్వారా విటమిన్-డి పొందవచ్చు. అందుకే పూర్తీ గుడ్డు తినమని వైద్యులు కూడా చెబుతారు.
సోయాబీన్స్..(soya beans)
సోయాబీన్స్, వీటి ఉత్పత్తులు ఆరోగ్యపరంగా చాలా ఆదరణ పొందుతున్నాయి. సోయా మిల్క్, సోయా చంక్స్, టోపు, మీల్ మేకర్ వంటివి సోయా ఉత్పత్తులే. వీటిలో విటమిన్-డి ఉంటుంది. అందుకే సోయా ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్-డి లోపం ఏర్పడదు. పైపెచ్చు ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.