Home Tips: పాత దుస్తులను పారేస్తున్నారా..? అయితే మీరు ఈ 7 విషయాలనూ తెలుసుకోవాల్సిందే..!
ABN , First Publish Date - 2023-10-09T11:47:57+05:30 IST
దుస్తులు కొనడం ఎక్కువయ్యే కొద్ది ఇంట్లో ఉన్న దుస్తులు పాతబడతాయి.. వాటిని ఇలా వాడితే మాత్రం అందరూ చప్పట్లు కొట్టి మరీ మెచ్చుకుంటారు.
ఒకప్పుడు పండుగలు, పుట్టినరోజులు, శుభకార్యాలకు దుస్తులు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు పడితే అప్పుడు, చిన్న చిన్న సందర్బాలకు కూడా దుస్తుల మీద భారీ డిస్కౌంట్లు ఉంటున్నాయి. ఆన్లైన్ లో కూడా బోలెడు కొనుగోలు చేస్తుంటారు. కొత్త దుస్తులు ఇంట్లో చేరితే అప్పటివరకు ఉన్నవి పాతదుస్తుల కేటగిరీలోకి వెళతాయి. కొన్నేళ్ళ కిందట అయితే ప్యాంటులను షార్టులుగానూ, చీరలను పంజాబీ డ్రెస్సులు, లంగా జాకెట్లు, గౌన్లు వంటివి కుట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటివి వేసుకోవడానికి పిల్లలు కూడా ఇష్టపడరు. అందుకే చాలామంది దుస్తులు కాస్త పాతబడగానే వాటిని పారేస్తుంటారు. కానీ పాత బట్టలను తిరిగి ఉపయోగించుకునే అద్భుతమైన ఐడియాలున్నాయి(old cloths re use ideas). వీటని ఫాలో అయితే అందరూ చప్పట్లు కొట్టి మరీ మీ క్రియేటీవిటీని మెచ్చుకుంటారు. అవేంటో తెలుసుకుంటే..
టీ షర్టులు, లేదా ఇతర దుస్తుల మీద ఏదైనా కొటేషన్ లాంటివి రాసి ఉంటే అలాంటి దుస్తులను పడేయకండి. కొటేషన్ ఉన్న ప్రాంతాన్ని నీట్ గా కత్తిరించి దాన్ని ఫ్రేమ్ లో ఉంచి గోడకు తగిలించాలి. ఇవి ఇంటికి కొత్త రూపాన్ని తెస్తాయి. ఫ్రేమ్ ఆర్ట్ గ్యాలరీ నుండి కొన్నట్టు అందంగా కనిపిస్తుంది.
Health Tips: ఆరోగ్యం మీద స్పృహతో ఉప్పు తక్కువ తింటుంటారా? ఈ నిజాలు తెలిస్తే..
ప్యాచ్ వర్క్ అనేది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. మందంగా ఉన్న క్లాత్ లు అస్సలు పడేయకూడదు. ఈ క్లాత్ లను కత్తిరించి వాటిని కలిపి కుట్టడం వల్ల బ్యాగులు, జాకెట్లు, షీట్లు మొదలైనవి తయారుచేయవచ్చు.
కొన్నేళ్ల కిందట పెద్దల దుస్తులతో పిల్లలకు దుస్తులు కుట్టేవారు. పెద్ద టీ షర్ట్ లను చిన్నపిల్లలకోసం మార్పు చేయడం, మంచి ఫ్యాబ్రిక్ కలిగిన దుపట్టాలు, లేదా చీరలు, పంజాబీ టాప్ లు మొదలైనవాటిని పిల్లల కోసం బోలెడు రకాల స్టైల్స్ లోకి మార్చవచ్చు.
మన్నికగా, అందంగా ఉన్న వెల్వెట్, షైనింగ్, కాటన్ క్లాత్ లను సేకరించి వాటికి కాస్త ఎలాస్టిక్ జోడించి ఇంట్లోనే జడకు స్క్రాంచీని తయారుచేయవచ్చు. బయట పదుల నుండి వందలు ఖర్చయ్యే వీటిని ఇంట్లో కేవలం 2నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు.
పేద, దిగువ తరగతి కుటుంబ మహిళలు చాలావరకు ఫాలో అయిన చిట్కా పాత దుస్తులను దిండులుగా మార్చడం. పాత దుస్తులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి దిండు కవర్ లో నింపి కుట్లు వేస్తే మెత్తని దిండు ఇంట్లోనే సిద్దం.
పాత దుస్తులలో అందంగా పలుచగా లేత రంగుల్లో ఉన్నవాటిని గిఫ్ట్ ర్యాపర్ లు గా ఉపయోగించవచ్చు. గిఫ్ట్ కు ఇదొక కొత్త లుక్ ఉస్తుంది. క్లాత్ ను పెటల్స్ పెట్టడం, వాటిని స్టాప్లర్ పిన్స్ తో బంధించడం వల్ల గిఫ్ట్ సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతుంది. ఇంకా మంచి దుపట్టాలు ఉంటే వాటిని షెల్ప్ లకు, కిటికిలకు కర్టెన్లుగా ఉపయోగించవచ్చు.
పాత బట్టలను అసలు దేనికీ ఉపయోగించలేం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించే మార్గం కార్పెట్, ఫ్లోర్ మ్యాట్ గా మార్చడం. ఇందుకోసం క్లాత్ ను ఇంచ్ నుండి అర ఇంచ్ వెడల్పుతో పొడవుగా కత్తిరించుకోవాలి. వీటిని దారాలుగా ఉపయోగిస్తూ రౌండ్ గా అల్లితే మంచి ఫ్లోర్ మ్యాట్ సిద్దమవుతుంది.