Nose Job Changed A Woman's Life: ముక్కు ఆపరేషన్ తరువాత పోటెత్తిన కాన్ఫిడెన్స్.. భర్తకు విడాకులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 10:47 PM
ముక్కు ఆపరేషన్ తరువాత వచ్చిన కొత్త ధైర్యంతో ఓ మహిళ తన జీవితంలో కొత్త అధ్యయనానికి తెరతీసింది. భర్తతో ఏడేళ్ల బంధానికి గుడ్ బై చెప్పి కొత్త జీవితంలో కాలుపెట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: ముక్కు ఆకృతి బాగుపడటంతో ఓ కట్టలు తెంచుకున్న కాన్ఫిడెన్స్ ఆమె జీవితాన్నే మార్చేసింది. భర్తతో పడకపోయినా ఏడేళ్లుగా కలిసుంటున్న ఆమె ముక్కు ఆపరేషన్ తరువాత ధైర్యంగా అతడికి విడాకులు ఇచ్చేసి కొత్త జీవితం ప్రారంభించింది. ముక్కు ఆపరేషన్‌తో తన జీవితాన్నే మార్చుకున్న పిలడెల్ఫియా మహిళ డెవిన్ అయికెన్ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.
‘‘ఈ వివాహం బంధం కారణంగా నేను ఏ రోజూ హ్యాపీగా లేను. భర్తతో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. కానీ నా ముక్కు ఆకృతి మారిపోయాక ఏదో తెలీని కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవితాన్ని వృథా చేసుకోవద్దని అనిపించింది. అందుకే భర్తకు విడాకులు ఇచ్చేశా’’ అని చెప్పింది. ప్రస్తుతం తాను ప్రతి ఉదయం సంతోషంతో నిద్రలేస్తున్నానని తెలిపింది.
ముక్కు ఆకృతి బాలేకపోవడంతో డెవిన్ చిన్నప్పటి నుంచీ హేళన ఎదుర్కుంటూనే ఉంది. తోటి విద్యార్థులు ఆమెను నిత్యం గేలిచేస్తునే ఉండేవాళ్లు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనే ఆమె పెరిగి పెద్దయ్యింది. 23 ఏళ్ల వయసులోనే పెళ్లి కూడా చేసుకుంది. ‘‘ఒకరి గురించి మరొకరికి అవకాశం లేకుండానే పెళ్లి చేసుకున్నాము. నా ముక్కు గురించి భర్త ఎప్పుడూ గేలి చేయలేదు కానీ ఇతర విషయాల్లో తమ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఒకరికొకరికి క్షణం కూడా పడేది కాదు’’ అని తెలిపింది.
పిలడెల్ఫియాకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ వద్ద ఆపరేషన్ చేయించుకుందామని నిర్ణయించుకోవడమే తన జీవితంలో మేలి మలుపని ఆమె పేర్కొంది. ఆరు గంటల ఆపరేషన్ తరువాత తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని ఆమె చెప్పింది. ఆ తరువాత కొద్ది వారాలకే తాను భర్తకు గుడ్‌బై చెప్పినట్టు పేర్కొంది.
అయితే, ఇటీవల కాలంలో అనేక మంది ప్రేమ బంధాల్లో ఇమడలేక బయటకొస్తున్న ట్రెండ్ పెరుగుతోందని చెబుతున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తు్న్నామనేందుకు సూచనగా ఆందాన్ని పెంచే ఆపరేషన్లు కూడా చేయించుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏఐ ఎఫెక్ట్.. నెలకు రూ.1.5 లక్షలు ఆర్జిస్తున్న పదో తరగతి కుర్రాడు
ఈ బాస్ నిజంగా గ్రేట్.. 70 ఉద్యోగులను తీసేశాక..
మన దేశంలో అంట్లు తోమే డిష్ వాషర్లు ఎందుకు పాప్యులర్ కాదంటే..