Filmmaker Sanoj Mishra: సనోజ్ మిశ్రాపై రేప్ కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటి
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:43 PM
Filmmaker Sanoj Mishra: బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రాపై నటి రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. సనోజ్ తనను రేప్ చేయటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మార్చి 31న ఆయన్ని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.

బాలీవుడ్ సినీ దర్శకుడు సనోజ్ మిశ్రాపై రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. నటి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ని మార్చి 31వ తేదీన అరెస్ట్ చేశారు. సరిగ్గా మూడు రోజులకే మిశ్రా రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సనోజ్ మిశ్రాపై రేప్ కేసు నమోదు కావటానికి, అతడు అరెస్ట్ అవ్వడానికి ఒకరకంగా మోనాలీసా కారణంగా తేలింది. సనోజ్‌పై ఫిర్యాదు చేసిన నటి తాజాగా సంచలన కామెంట్లు చేసింది. కేసు ఎందుకు పెట్టిందో వివరించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ నన్ను సనోజ్ మిశ్రా రేప్ చేయలేదు. అతడు నన్ను రేప్ చేశాడని, వేధించాడని నేను ఎక్కడా చెప్పలేదు. మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాము. రిలేషన్ అన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి.
మహా కుంభమేళాతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన మోనాలీసాతో అతడు తిరగటం నేను తట్టుకోలేకపోయాను. వారిద్దరి బాండింగ్ చూసి కోపం వచ్చింది. నన్ను మిశ్రా శత్రువులు తప్పు దారి పట్టించారు. నన్ను ఆయనపై కేసు పెట్టేలా చేశారు. కొంతమంది లాయర్లు నా దగ్గరకు వచ్చారు. నన్ను రెచ్చగొట్టారు. ఫ్రీగా నా కేసు వాదిస్తామని చెప్పారు. వారి కారణంగానే నేను ఫిర్యాదు చేశాను. కానీ, ఎక్కడా కూడా రేప్ చేశాడని చెప్పలేదు. అతడు నా ప్రైవేట్ వీడియో తీసి బెదిరించాడని కూడా చెప్పలేదు. నేను కంప్లైంట్ రాసిన తర్వాత.. లాయర్లు అందులో మార్పులు చేశారు. ఈ తప్పుడు పాయింట్లు అందులో చేర్చారు. పోలీసులకు ఇచ్చారు. ఇలా చేస్తే కేసు బలంగా ఉంటుందని నాతో చెప్పారు. నేను వాళ్లతో మొత్తుకుని చెప్పాను.
మిశ్రా నన్ను రేప్ చేయలేదని.. అయినా వాళ్లు వినలేదు. బలవంతంగా నాతో కంప్లైంట్ ఇప్పించారు. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. అతడు నన్ను కొట్టలేదు, వేధించలేదు. అతడ్ని రేపిస్టులా చూడకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. పాపం.. అతడి టైం బాగోలేదు ’ అని అంది. కాగా, సనోజ్ మిశ్రాకు ఇది వరకే పెళ్లయింది. శృతి మిశ్రా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. సనోజ్ మిశ్రా దర్శకుడిగా ఇప్పటి వరకు 10కి పైగా సినిమాలు చేశాడు. అది కూడా తన సొంత నిర్మాణ సంస్థలో ఆ సినిమాలు చేశాడు. మహా కుంభమేళాతో సెన్సేషన్ అయిన మోనాలీసాకు సినిమా ఆఫర్ ఇచ్చి.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. రేప్ కేసుతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
ఇవి కూడా చదవండి:
Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు
Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..