Pani Puri: పానీ పూరీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది.. మీక్కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా..?

ABN , First Publish Date - 2023-06-26T17:27:34+05:30 IST

పానీపూరీ అంటే బాగా ఇష్టం ఉన్నవారికి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ పానీ పూరీ తినాలని అనిపిస్తుంటుంది. టైం, ప్లేస్ తో పనిలేకుండా..

Pani Puri: పానీ పూరీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది.. మీక్కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా..?

భారతీయులు ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్ లో పానీ పూరీ కూడా ఒకటి. పిల్లల నుండి పెద్దల దాకా పానీపూరీ తినడానికి ఇష్టపడతారు. ఏ ఉద్యోగం లేకపోయినా ఓ చిన్న పానీ పూరీ బండి పెట్టి బతుకుబండి లాగించేవారు చాలామందే ఉన్నారు భారతదేశంలో. పానీపూరీ అంటే బాగా ఇష్టం ఉన్నవారికి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ పానీ పూరీ తినాలని అనిపిస్తుంటుంది. టైం, ప్లేస్ తో పనిలేకుండా పానీపూరీ తినాలనే వర్గం మీరైతే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.. ఈ వీడియో చూశారంటే 'వావ్ ఇదేదో భలేగుందే.. మనక్కూడా అలా ఉంటే బాగుండు' అని అనకుండా ఉండలేరు. పానీపూరీ లవర్స్ ను ఫిదా చేస్తున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

సాధారణ సమయాల్లో కంటే ప్రయాణాలు(journey) చేస్తున్నప్పుడు జిహ్వచాపల్యం ఎక్కువ అవుతుంటుంది. సాధారణంగా ట్రైన్ లలో సమోసాలు, భేల్ పూరీ వంటి తినుబండారాలు అమ్మడం మాత్రమే చూసి ఉంటాం. కానీ పానీ పూరీ అమ్మడం ఎక్కడైనా చూశారా? ట్రైన్ లో పానీపూరీ సాధ్యం కాదని అనుకుంటారేమో.. ఓ పానీపూరీ సెల్లర్(pani puri seller) దీన్ని సుసాధ్యం చేశాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ లో ఎంతో జాగ్రత్తగా అందరికీ పానీపూరీ సర్వ్ చేస్తున్న ఇతన్ని చూస్తే ఫిదా అవుతారు. వీడియోలో రన్నింగ్ లో ఉన్న ట్రైన్ లో పానీ పూరీ అమ్ముతూ ఓ వ్యక్తి కనిపిస్తాడు(pani puri selling in train). అతని చుట్టూ పానీపూరీ కొనుగోలు చేస్తూ కొందరు, తాము కొనుగోలు చేసిన వాటిని తింటూ మరికొందరు కనిపిస్తారు. కోల్‌కతా లోకల్ ట్రైన్(kolkatta local train) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆకలి, జిహ్వచాపల్యం ప్రతి మనిషి బలహీనత. అలాంటి బలహీనతను ఆసరా చేసుకుని తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఈ పానీపూరీ సెల్లర్ ఇప్పుడు నెటిజన్లు ఆకర్షిస్తున్నాడు.

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?


ఈ వీడియో indian_railways-memes అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి షేర్ చేశారు. 'లోకల్ ట్రైన్లలో కూడా పానీపూరీ అమ్మకం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణీకులు పానీపూరీని ఎంజాయ్ చేస్తున్నారు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. పానీపూరీ లవర్స్ అయితే ఈ వీడియో చూసి ఫుల్ ఖుషీ అయిపోయారు. 'ఇలాంటివి అన్నిచోట్లా అందుబాటులోకి వస్తే బాగుంటుంది' అని అంటున్నారు. 'కోల్‌కతా లోకల్ ట్రైన్లలో సాధ్యంకానిది ఏదీ లేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇది ఢిల్లీ మెట్రోలో జరగలేదు బ్రతికిపోయాం' అని మరికొందరు వ్యంగంగా కామెంట్ చేస్తున్నారు. అతను మంచి వ్యాపారవేత్త అవుతాడు అని అతని వ్యాపార తెలివితేటల గురించి మరికొందరు అంటున్నారు.

Health tips: పిల్లలు పుట్టడం లేదని బెంగా? పడుకునేముందు పాలలో ఇదొక్కటి కలిపి తాగితే చాలు.. అద్బుతమైన ఫలితాలుంటాయి!


Updated Date - 2023-06-26T17:27:34+05:30 IST