Satyaraj: చిన్న సినిమాలు చాలా కష్టం.. జ్యోతిష్యాన్ని నమ్మి తీయొద్దు..

ABN , First Publish Date - 2023-02-21T13:36:51+05:30 IST

నటుడు సత్యరాజ్‌ (Satyaraj) సినిమాలు జ్యోతిష్యాన్ని (Astrology) నమ్మి తీయొద్దని కొత్తగా చిత్రపరిశ్రమలోకి వచ్చే దర్శక నిర్మాతలకు సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ హితవు పలికారు.

Satyaraj: చిన్న సినిమాలు చాలా కష్టం.. జ్యోతిష్యాన్ని నమ్మి తీయొద్దు..
Satyaraj

నటుడు సత్యరాజ్‌ (Satyaraj) సినిమాలు జ్యోతిష్యాన్ని (Astrology) నమ్మి తీయొద్దని కొత్తగా చిత్రపరిశ్రమలోకి వచ్చే దర్శక నిర్మాతలకు సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ హితవు పలికారు. సత్యరాజ్‌, అజ్మల్‌, జైవంత్‌, దుష్యంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దీర్ఘదరిసి’ (Deerghadarisi). ఈ చిత్రం ఆడియో లాంచ్‌ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా సత్యరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక సినిమా తీయాలని భావించే కొత్త నిర్మాత ముందుగా సినిమా అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం.

జ్యోతిష్యం నమ్ముకుని సినిమాల్లోకి రాకూడదు. సినిమా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగుపెట్టాలి. భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణం కంటే చిన్న సినిమాలు నిర్మించడం చాలా కష్టం. హీరో స్థాయికి తగిన విధంగా సినిమా తీయాలి. ఒక సినిమాకు స్ర్కిప్టు ముఖ్యం. దాని తర్వాతే హీరో, హీరోయిన్‌, విలన్‌. దర్శకులు కూడా హీరో స్థాయికి తగిన విధంగా సినిమాలు తీయాలి. నాకు తమిళం మినహా వేరే భాష రాదు. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘లవ్‌ టుడే, ‘డాడా’ చిత్రాలతో పాటు ‘అయలి’ అని వెబ్‌ సిరీస్‌ దీనికి నిదర్శనం’’ అని చెప్పారు.

ఇది కూడా చదవండి: Michael heroine: అలా చేయడం బాధనిపించింది.. కానీ..

ఈ ఆడియో కార్యక్రమంలో దర్శకులు ఆర్‌.కె.సెల్వమణి, ఆర్‌.ఉదయకుమార్‌, పేరరసు సహా నటుడు రాంకుమార్‌, చిత్ర బృందం పాల్గొన్నారు. శ్రీ శరవణ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మాత సతీష్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి పీజీ మోహన్‌ - ఎల్‌ఆర్‌ సుందరపాండి కలిసి దర్శకత్వం వహించారు. కెమెరా జె.లక్ష్మణ్‌ కుమార్‌, సంగీతం జి.బాలసుబ్రహ్మణ్యం. ఈ చిత్రం ద్వారా అజ్మల్‌, దుష్యంత్‌, జైవంత్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Updated Date - 2023-02-21T13:36:52+05:30 IST