iPhone Prices: ట్రంప్ టారిఫ్ ప్రభావం..ఇకపై రూ.2 లక్షలకు ఐఫోన్ ధరలు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:35 AM
ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఐఫోన్ తీసుకోవాలని చూసే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. అయితే ఏ మేరకు వీటి ధరలు పెరిగే ఛాన్సుంది, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనిని అనేక దేశాలు వ్యతిరేకించడంతో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు వస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే నిన్న భారత్ సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో సుంకాల ఎఫెక్ట్ ఐఫోన్ ధరలపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనాకు కొత్త టారిఫ్‌లను విధించడం ద్వారా ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఆర్థిక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.
చైనా నుంచి దిగుమతులపై 20% టారిఫ్
అయితే ఐఫోన్ తయారీకి కీలకమైన ప్రాంతం చైనా. ఐఫోన్‌ను తయారు చేసే ప్రాథమిక కేంద్రం అక్కడే ఉండగా, అన్ని ఐఫోన్ లైట్స్, ప్రొడక్ట్‌లను కూడా చైనా నుంచే అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. ట్రంప్ తన పదవీకాలంలో మొదటి సారి చైనా నుంచి దిగుమతులకు 20 శాతం టారిఫ్‌ను విధించినప్పుడు, ఆపిల్ వంటి ప్రముఖ కంపెనీలకు కొంత ఉపశమనం ఇచ్చారు. కానీ, తాజాగా, ఆయన మరింత కఠినమైన విధానాన్ని ప్రవేశపెట్టారు.
ట్రంప్ కొత్త టారిఫ్‌లు
తాజా నిర్ణయం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి వచ్చే దిగుమతులపై 34 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. దీని ప్రభావం ముఖ్యంగా ఐఫోన్‌లపై కనిపించనుంది. దీంతో ఐఫోన్ ధరలు అమాంతం పెరగనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త టారిఫ్‌లు అమలులోకి వచ్చినట్లైతే, ఐఫోన్ ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఐఫోన్ 16 బేస్ మోడల్ ప్రస్తుతం అమెరికాలో $799గా (రూ.67,915) అమ్ముడవుతోంది. అయితే, ఈ టారిఫ్‌ల ప్రభావం వల్ల ఈ ధర 43% పెరిగి $1,142కి (రూ.97,070) చేరుకోవచ్చు. అలాగే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం $1,599కు అమ్ముడవుతోంది. కానీ, ఈ కొత్త టారిఫ్‌ల వల్ల ఇది దాదాపు $2,300కి (రూ.1,95,500) పెరిగే అవకాశం ఉంది.
ఐఫోన్ ధర పెరగడం అంటే
ఐఫోన్ ధరలు పెరగడం వల్ల ఇప్పుడు $2,000లకు చేరితే వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపించనుంది. దీంతో ఐఫోన్ కొనాలని భావిస్తున్నవారికి ఇది కొంత ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. ఇప్పటికీ ఐఫోన్‌కు ఉన్న మార్కెట్ డిమాండ్ ఉన్నప్పటికీ, అధిక ధరలతో యూజర్లు మరో కంపెనీ ఫోన్లపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ కొత్త టారిఫ్‌ల అమలుకు వచ్చినప్పుడు, ఇది ఐఫోన్‌ల తయారీకి అవసరమైన ఖర్చులను 43% వరకూ పెంచే అవకాశం ఉంది. దీంతో ఆపిల్ మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని ఈ టారిఫ్‌లు పెంచి కంపెనీపై భారాన్ని మోపనున్నాయి. తద్వారా, వినియోగదారులకు ఐఫోన్‌లు మరింత ఎక్కువ ధరలకు లభించే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News