Share News

Hyderabad: బట్టతలపై జుట్టు మొలిపిస్తా.. పాతబస్తీలో పెద్దఎత్తున ప్రచారం

ABN , Publish Date - Apr 08 , 2025 | 07:11 AM

వయసు రీత్యా ఊడిపోయే వెంట్రుకలు తిరిగి మొలిపిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వెంట్రుకలు తిరిగి రావని తెలిసికూడా పలువురు ఈ మోసగాళ్ల చేతిలో బలవుతున్నారు. ఇటువంటి మోసమే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: బట్టతలపై జుట్టు మొలిపిస్తా.. పాతబస్తీలో పెద్దఎత్తున ప్రచారం

- బిగ్‌బాస్‌ హెయిర్‌ సెలూన్‌ ఎదుట బారులు

- మందు ఫ్రీ.. గుండుకు రూ.వంద

- రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వజీర్‌

హైదరాబాద్: బట్టతలపై జుట్టు మొలిపిస్తానని ప్రచారం చేయడంతో పాతబస్తీలోని ఓ దుకాణం ఎదుట భారీ ఎత్తున బారులు తీరుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన వజీర్‌(Vizier) నగరానికి వచ్చి ఫతేదర్వాజ-చందూలాల్‌ బారాదరి రహదారిపై బిగ్‌బాస్‌ పేరుతో హెయిర్‌ సెలూన్‌(Hair Salon) ఏర్పాటు చేశాడు. బట్టతలపై వెంట్రుకలు మొలిపించే మందు తనవద్ద ఉందంటూ ప్రచారం చేశాడు. బట్టతలతో విసిగిపోతున్నవారు నెల రోజులుగా అతడి సెలూన్‌ ముందు బారులు దీరుతున్నారు. ప్రస్తుతం రోజుకు వంద మంది క్యూ కడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Gold Silver Rates Today: వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి


గుండు ఎక్కడ చేయించుకున్నా ఓకే..

వజీర్‌ ముందుగా బాధితులకు గుండుగీసి ఏదో మందును పూస్తున్నాడు. మందుకు డబ్బులు తీసుకోవడం లేదు. గుండు గీసినందుకు రూ.వంద వసూలు చేస్తున్నాడు. గుండు బయట గీయించుకుని వస్తే ఉచితంగానే మందు రాస్తానని ఆఫర్‌ ఇస్తున్నాడు. బట్టతలకు ఉచితంగా మందు ఇస్తుండడంతో నగరం నలుమూలల నుంచి జనం రావడం మొదలైంది. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కూడా అవుతోంది.


city1.2.jpg

కాగా, కారణాలు తెలియవు కాని రెండు రోజులుగా వజీర్‌ కనిపించడం లేదు. తన స్వస్థలానికి వెళ్లిపోయాడని దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం కస్టమర్లు అంతంత మాత్రంగానే వస్తున్నారు. వచ్చే ఒకరిద్దరికి సిబ్బందే మందు రాస్తున్నారు. మందు ఫార్ములా తమకు తెలియదంటున్నారు. అయితే, ఈ మందు వల్ల జుట్టు వచ్చిందని చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. మందు శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, బిగ్‌బాస్‌ హెయిర్‌ సెలూన్‌(Bigg Boss Hair Salon)పై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని కాలాపత్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 07:11 AM