Hyderabad: తన మాటలతో ముగ్గులోకి దింపి.. వలపు వల విసిరి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:44 AM
తన మాటలతో ముగ్గులోకి దింపి.. వలపు వల విసిరి కొందరు యువతులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడరంలో ఎక్కువయ్యాయి. ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే అటు ఆర్థికంగా, ఇటు శారీరకంగా మోసపోతున్నారు.

- వలపు వల.. చిక్కితే విలవిల
- లాభాలతో ప్రలోభపెట్టి మోసాలు
- డేటింగ్ యాప్‌లలో నేరగాళ్ల తిష్ఠ
- రూ. లక్షల్లో కొల్లగొడుతున్న వైనం
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: నోయిడాకు చెందిన ఒక సంస్థ యజమాని భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఓ డేటింగ్ యాప్(Dating app)లో అతడికి ఒక యువతి పరిచయమైంది. తన మాటలతో ముగ్గులోకి దింపి వలపు వల విసిరింది. కొద్దిరోజులకు అతను పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. ఇదే మంచి అవకాశంగా భావించిన ఆమె ఆన్‌లైన్ ట్రేడింగ్ గురించి, అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలు వచ్చే కంపెనీల గురించి చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్పిన చోట పెట్టుబడులు పెట్టేవాడు.
ఈ వార్తను కూడా చదవవండి: Hyderabad: బట్టతలపై జుట్టు మొలిపిస్తా.. పాతబస్తీలో పెద్దఎత్తున ప్రచారం
ప్రారంభంలో ఊహించని లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ లాభాలను విత్‌డ్రా చేసుకునేవాడు. దాంతో ఆ యువతిపై మరింత నమ్మకం పెరిగింది. మెల్లగా ఊబిలోకి దింపిన యువతి విడతల వారీగా రూ.6 కోట్లు పెట్టుబడులు పెట్టించింది. ఆ తర్వాత నిర్వాహకులు విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. యువతి కాంటాక్ట్ కూడా కట్ అయింది. బాధితుడు ఆమె ప్రొఫైల్‌ను చెక్ చేయగా అది నకిలీదని తెలిసింది. దీంతో అతడు నోయిడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కేసులు అనేకం నమోదు అవుతున్నాయని పోలీసులు తెలిపారు.
రూటు మార్చిన క్రిమినల్స్
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అత్యధికంగా కొల్లగొడుతున్న మోసాల్లో ఆన్‌లైన్ ఇన్వెస్టిమెంట్ అగ్ర స్థానంలో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రలోభపెట్టగానే అనేక మంది అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈరకం మోసాలు ట్రెండింగ్‌లో ఉండటంతో ప్రజల్లో అవగాహన వచ్చింది. విషయం గుర్తించిన సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. వివిధ రకాల డేటింగ్ యాప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తిష్ట వేస్తున్నారు.
కొద్దిరోజులు నిఘా పెట్టి కొంతమందిని సెలక్ట్ చేసుకుంటున్నారు. ముందుగా నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ముఠాలోని యువతులను రంగంలోకి దింపుతున్నారు. వలపు విసిరి దారిలోకి తెచ్చుకున్న తర్వాత అసలైన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇన్వెస్టిమెంట్స్‌లో అధిక లాభాల పేరుతో ఆకర్శించి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ప్రారంభంలో లాభాలు చూపించి ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి అందినంతా దోచేస్తున్నారు. డబ్బులు చేతికి అందగానే ఆచూకీ లేకుండా పోతున్నారు.
అప్రమత్తం
కొత్తరకం ఎత్తుగడతో ఇన్వె్‌స్టమెంట్ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గుర్తుతెలియని మహిళలతో పరిచయాలు పెంచుకోవద్దని పేర్కొంటున్నారు. డేటింగ్ యాప్‌లలో స్నేహం చేసేవారితో ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News