Share News

Washing Machine Funny Video: వాషింగ్‌ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Apr 08 , 2025 | 07:45 AM

ఓ మహిళ వాషింగ్ మెషిన్ వద్దకు వెళ్తుంది. ఈ సీన్ చూస్తే అందులో మాసిన బట్టలను వేసి శుభ్రం చేస్తుందేమో.. అని అంతా అనుకుంటారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసింది. ఈమె నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Washing Machine Funny Video: వాషింగ్‌ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒక వస్తువును అంతా ఒక విధంగా వాడితే.. కొందరు మాత్రం చిత్రవిచిత్రంగా వాడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి విచిత్ర ప్రయోగాలు ఎక్కువగా చేస్తుంటారు. కొందరు సైకిల్ చక్రంతో దస్తులను వాష్ చేస్తే.. మరికొందరు ఏకంగా ఇటుకలతోనే వాషింగ్ మెషిన్ నిర్మిస్తుంటారు. అలాగే ఇంకో మహిళ ఇదే వాషింగ్ మెషిన్‌లో ఏకంగా గిన్నెలు వేసి శుభ్రం చేయడం కూడా చూశాం. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వాషింగ్‌ మెషిన్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడరేమో..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్ వద్దకు వెళ్తుంది. ఈ సీన్ చూస్తే అందులో మాసిన బట్టలను వేసి శుభ్రం చేస్తుందేమో.. అని అంతా అనుకుంటారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసింది. పెద్ద గిన్నెలో బంగాళాదుంపలను తీసుకొచ్చి అందులో పడేసింది.

Lion VS Wildebeest: వైల్డ్‌బీస్ట్‌పై సింహం దాడి.. చివరకు చుక్కలు కనిపించాయిగా..


తర్వాత మిషిన్‌ను ఆన్ చేయగా.. గిరాగిరా తిరిగి వాటిని శుభ్రం చేస్తుంది. అయితే చివరకు డోర్ ఓపెన్ చేసి చూడగా.. బంగాళాదుంపులన్నీ శుభ్రంగా తొక్క తీసి కనిపిస్తాయి. ఇలా బట్టలు ఉతకాల్సిన మెషిన్‌లో (Woman cleaning potatoes in washing machine) బంగాళాదుంపలను శుభ్రం చేసిన ఈమె అతి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు. చూస్తుంటే.. ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాషింగ్‌ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది ఫేక్ వీడియో అయినా.. కామెడీ మామూలుగా లేదుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.95 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral: నన్ను ముట్టుకోవద్దు.. మొదటి రోజు వధువు వింత కండీషన్.. తర్వాత జరిగిందేంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 07:45 AM