Share News

Goat Viral Video: సూపర్ హీరోలా స్టంట్లు చేసిన మేక.. కరెంటు వైర్లపైకి ఎక్కి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:26 PM

Electrifying Goat Adventure: కరెంటు తీగలపైకి ఎక్కి మేక చేసిన విచిత్ర విన్యాసాలు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అంత ఎత్తున్న ఎలక్ట్రిక్ వైర్లపైకి వెళ్లడమే పెద్ద వింతైతే.. షాక్ తగలకుండా సూపర్ హీరోలా స్టంట్లు ఎలా చేయగలిగిందబ్బా అని చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

Goat Viral Video: సూపర్ హీరోలా స్టంట్లు చేసిన మేక.. కరెంటు వైర్లపైకి ఎక్కి ఏం చేసిందంటే..
Goat Climbing Viral Video

Electrifying Goat Adventure Viral On Online: ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కరెంటు వైర్లపైకి ఎగబాకి ఓ మేక చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. రెండు విద్యుత్ తీగలపై కాళ్లు పెట్టి సర్కస్ చేస్తూ మేక చేసిన విన్యాసాలు చూసే వాళ్లకి గుబులు పుట్టించాయి గానీ.. మేక గారు మాత్రం తాపీగా తాను చేయాలనుకున్న పని చేసేసింది. ఇందుకోసం ఇంతకు తెగించిందా.. ఇదెక్కడి విచిత్రమైన మేక రా నాయనోయ్.. ఎక్కడా చూడలేదని నెటిజన్లు నిర్ఘాంతపోతున్నారు.


సూపర్ మేక.. సూపర్ విన్యాసాలు..

సాధారణంగా మేకలు గడ్డి ఎక్కడ తింటాయ్.. నేల పైనా లేక కరెంటు వైర్లపైనా.. ఇదేం వింత ప్రశ్న..నేలపై తినక అక్కడెలా తింటుంది.. అసలు అక్కడ గడ్డి ఎలా వస్తుందని అనుకుంటున్నారా.. నిజమండీ బాబూ.. మిగిలిన మేకల సంగతేమో గానీ ఇది మాత్రం సూపర్ మేకనే.. గడ్డి కోసం ఏకంగా ఎలక్ట్రిక్ వైర్లపైకి ఎలా ఎక్కిందో గానీ.. ఒక్కో తీగపై ఒక్కో కాలు మోపి బ్యాలెన్స్ చేసుకుంటూ గడ్డి దగ్గరకు చేరుకుంది. కరెంటు షాక్ కొడుతుందేమో.. కింద పడిపోతుందేమో.. అని చూసేవాళ్ల గుండెల్లో గుబులు రేగినా.. ఆ మేక మాత్రం ఎంచక్కా సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వెళ్లి కూల్‌గా ఆకులు కొరుకుతూ ఉంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


గడ్డి కోసం మేక చేసిన స్టంట్ వీడియో చూసి విద్యుత్ శాఖ అధికారులు కూడా షాక్ అవుతున్నారు.ఇక నెటిజన్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల రియాక్షన్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. "అది మేక కాదు.. స్పైడర్‌మ్యాన్‌కి చెల్లెలు అయి ఉంటుంది" అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు ఓ నెటిజన్. అలాగే "ఇది మేకా లేక సర్కస్‌లో మిస్సైన యానిమలా?" అని ఒకరు, , "మేకలకు కరెంటు షాక్ తగలదని ఎక్కడుందబ్బా.. ఇది సూపర్ పవర్స్ ఉన్న హీరోలా ఉంది" అని మరొకరు , "నాకైతే దీన్ని చూసి కరెంట్ షాక్ తగిలినట్టు అయ్యింది!" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Read Also: Viral News: వరుడి చెప్పులు దాచి రూ.50 వేలు డిమాండ్..చివరకు దాడి, ఇది కరెక్టేనా..

బట్టతలపై జట్టు మొలిపించే మందు.. క్యూ కట్టిన జనం.. తీరా చూస్తే..

Humanoid Robot: మనుషులతో సమానంగా డ్యాన్స్, యాక్టింగ్ ఇరగదీసిన రోబో

Updated Date - Apr 07 , 2025 | 05:30 PM