Share News

Man vs Mosquito: నిద్రపోనివ్వట్లేదని.. దోమలకు స్డూడెంట్ డిస్కో పార్టీ..

ABN , Publish Date - Apr 07 , 2025 | 08:51 PM

Man Mosquito Hunt Viral Video: రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా కుట్టి చంపుతున్న దోమలపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని కంకణం కట్టుకున్న ఓ స్టూడెంట్.. వాటికి డిస్కో పార్టీ అరేంజ్ చేశాడు. విచిత్రమైన ఈ ప్లాన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Man vs Mosquito: నిద్రపోనివ్వట్లేదని.. దోమలకు స్డూడెంట్ డిస్కో పార్టీ..
Man Mosquito Hunt Viral Video

Man Mosquito War Viral Video: సుఖంగా నిద్రపోనివ్వకుండా చేస్తున్న దోమలను అంతం చేసేందుకు వింత ప్లాన్ వేశాడు ఓ స్డూడెంట్ జ్ఞాని. వాటిపై సరికొత్త యుద్ధం ప్రకటించాడు. దోమల జాతి సర్వనాశనానికి ఈ యోధుడి వేసిన పథకం చూసి ఊరు ఊరంతా అవాక్కైంది. తర్వాత నా ప్లాన్ ఎలా ఉందో చూడండంటూ ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి "దోమలతో యుద్ధం" భలే ఉందంటూ సరదాగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.


దోమలపై యుద్ధం.. డిస్కో పార్టీకి ఆహ్వానం..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జుగాడ్ అనే యువకుడు రాత్రి పడుకున్న క్షణం నుంచి ఇంట్లో ఉండే దోమలు సుఖంగా నిద్రపోనివ్వకుండా తెల్లార్లు సతాయించేవి. వీటిని తరిమికొట్టేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అందుకని ఓ వింత ఆలోచన చేశాడు. ఇంట్లో ఓ పెద్ద ఫ్యాన్, కొన్ని రంగు లైట్లు, ఒక పాత బకెట్‌తో ఈ "ట్రాప్" సిద్ధం చేశాడు. ఇది చూసేందుకు అచ్చంగా డిస్కో పార్టీలో ఉండే సెటప్ లాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే,ఈ యంత్రం దోమలను నాశనం చేయడం సంగతి అటుంచితే, దీని నుంచి వచ్చే భారీ సౌండ్‌ విని పక్కింటి కుక్కలు గట్టిగా మొరగడం మొదలెట్టాయి. దాంతో జుగాడ్ తన నిద్ర కోసం ఊరందరి నిద్రని చెడగొట్టినట్లయ్యింది.


ఈ వీడియో చూసి నెటిజన్లు అదిరిపోతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ "ఇతను దోమలను చంపడం కాదు, వాటికి డిస్కో పార్టీ ఇచ్చాడు" అంటే, మరొకరు "ఇంత కష్టపడి యంత్రం తయారు చేసే బదులు ఆల్ అవుట్ వాడితే సరిపోతుంది కదా"అని, కొందరైతే ఏకంగా " ప్రపంచంలో దోమలపై మొదటిసారి యుద్ధానికి దిగిన మనిషి" అంటూ సరదాగా జోక్ చేశారు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ ఘటన తర్వాత దోమలు భయపడి పక్క ఊరికి పారిపోయాయనే ఓ రూమర్ కూడా షికారు చేసింది.


Read Also: Optical Illusion: ఈ గదిలో కుక్క ఎక్కడుంది.. 99 శాతం మంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయలేకపోయారు

Goat Viral Video: సూపర్ హీరోలా స్టంట్లు చేసిన మేక.. కరెంటు వైర్లపైకి ఎక్కి ఏం చేసిందంటే..

Man Pulls Out Own Tooth: భరించలేనంత పన్ను నొప్పి.. దొరకని డెంటిస్ట్ అపాయింట్‌మెంట్.. రోగి షాకింగ్ నిర్ణయం

Updated Date - Apr 07 , 2025 | 08:52 PM