Viral Video: క్లాస్ రూమ్‌లో టీచర్‌కి సడన్ షాక్.. విద్యార్థులు గొడవపడుతున్నారంటూ లోపలికి తీసుకెళ్లి.. ఉన్నట్టుండి..
ABN , First Publish Date - 2023-11-12T18:22:14+05:30 IST
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు బాటలు వేస్తుంటారు. అందుకే ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా వారి చిన్ననాటి గురువులను ఎప్పటికీ మర్చిపోలేరు. టీచర్..
తల్లి, తండ్రి, గురువు, దైవం.. అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు బాటలు వేస్తుంటారు. అందుకే ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా వారి చిన్ననాటి గురువులను ఎప్పటికీ మర్చిపోలేరు. టీచర్, విద్యార్థుల మధ్య చోటు చేసుకునే భావోద్వేగ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. క్లాస్ రూమ్‌లో ఓ మహిళా టీచర్‌కు విద్యార్థలంతా కలిసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. విద్యార్థులు గొడవపడుతున్నాంటూ లోపలికి పిలిచి చివరికి ఏం చేశారంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‌లో విద్యార్థులంతా గొడవపడుతూ గోళ గోళ చేస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థినులు పరుగెత్తుకుంటూ టీచర్ (Teacher) వద్దకు వెళ్లి.. ‘‘టీచర్.. టీచర్.. స్టూడెంట్స్ అంతా కలిసి గొడవపడుతున్నారు.. వెంటనే రండి’’.. అని పిలిచారు. దీంతో ఆమె ఒక్కసారిగా కంగారుపడిపోయింది. పరుగెత్తుకుంటూ క్లాస్ రూమ్‌లో గొడవ పడుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లింది. ‘‘గొడవలు ఆపండి’’.. అంటూ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె తీరా తగ్గరికి రాగానే.. వారంతా కలిసి పూల బోకేలతో ‘‘హ్యాపీ బర్త్‌డే (birthday).. టీచర్’’.. అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరికొందరు విద్యార్థులు రంగు రంగు కాగితాలను గాల్లోకి బ్లాస్ట్ చేస్తారు. విద్యార్థులంతా ఇలా ఊహించని విధంగా తనకు శుభాకాంక్షలు చెప్పడం చూసి ఆమె ఒక్కసారిగా భావేద్వేగానికి గురవుతుంది. తనపై వారు చూపిన ప్రేమకు తట్టుకోలేక కన్నీరు పెడుతుంది. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ సన్నివేశం చూస్తుంటే.. మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయ్’’.. అంటూ కొందరు, ‘‘అద్భుత సన్నివేశం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.