Viral News: అమెరికా తల్లి టార్చర్ భరించలేక నరకం.. 20 ఏళ్ల తర్వాత కన్న తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు.. ఓ యువతి కథ ఇదీ..!

ABN , First Publish Date - 2023-09-28T16:21:10+05:30 IST

విదేశాలలో జీవితం, ధనవంతుల ఇళ్ళకు దత్తత వెళ్లడం వెనుక కొందరికి నరకం కూడా పరిచయం అవుతుంది. భారతదేశానికి చెందిన ఓ యువతి సరిగ్గా అదే అనుభవాన్ని ఎదుర్కొంది.

Viral News: అమెరికా తల్లి టార్చర్ భరించలేక నరకం.. 20 ఏళ్ల తర్వాత కన్న తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు.. ఓ యువతి కథ ఇదీ..!

విదేశాలకు వెళ్తే ఇక కష్టాలు అన్నీ తీరిపోయినట్టే అనుకుంటారు కొందరు. పేద కుటుంబంలో పిల్లలను ధనవంతులు దత్తత తీసుకుంటే వారి జీవితం ఎలాంటి సమస్య లేకుండా గడిచిపోతుందని అనుకుంటారు. కానీ విదేశాలలో జీవితం, ధనవంతుల ఇళ్ళకు దత్తత వెళ్లడం వెనుక కొందరికి నరకం కూడా పరిచయం అవుతుంది. భారతదేశానికి చెందిన ఓ యువతి సరిగ్గా అదే అనుభవాన్ని ఎదుర్కొంది. దత్తతకు తీసుకున్న తల్లి ఆమెకు చూపించిన నరకాన్ని భరించి, చివరికి తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి 8వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ భారతదేశానికి వచ్చిన ఈ యువతి గురించి కథ పూర్తీగా తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నోలోని చార్బాగ్ రైల్వేస్టేసన్లో 2000సంవత్సరంలో 3ఏళ్ళ పాపను ఎవరో వదిలేశారు. ఆ పాపను గమనించిన పోలీసులు స్టానికంగా ఉన్న ఒక అనాథాశ్రమానికి(orphan home) తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. రెండేళ్లపాటు ఆ పాప అనాథాశ్రమంలోనే పెరిగింది. ఆ తరువాత యుఎస్(US) లోని మిన్నెసోటా ప్రాంతానికి చెందిన కరోల్ బ్రాండ్ అనే మహిళ భారతదేశానికి వచ్చి ఆ పాపను దత్తత తీసుకుంది. దత్తత తీసుకున్న తల్లితో పాటు యుఎస్ విమానం ఎక్కీ ఎక్కడంతోనే ఆ పాపకు కష్టాలు మొదలయ్యాయి. కరోల్ బ్రాండ్ మాదకద్రవ్యాలకు బానిసైన మహిళ. ఆమె మానసిక స్థితి సరిగా లేని సమయంలో ఎవరైనా ఒక పాపను దత్తత తీసుకుని పెంచుకుంటే పరిస్థితి బాగవుతుందని బంధువులు చెప్పడంతో ఆమె ఆ పని చేసింది. కానీ ఆమె దత్తత తీసుకున్న తరువాత ఆ పాపను హింసించం మొదలుపెట్టింది. 12ఏళ్ళ వరకు ఆమె చేతుల్లో హింస భరిస్తూ పెరిగింది. ఆ తరువాత తనతో ఉండాలంటే అద్దె చెల్లించాలని ఆ పాపను కరోల్ డిమాండ్ చేసింది. గత్యంతరం లేక ఆ పాప 12ఏళ్ల వయసులో బేబీ సిటర్ గా మారి డబ్బు సంపాదన వేటలో పడింది. దాంతో వచ్చే ఆదాయాన్ని కరోల్ కు ఇచ్చేది. 18ఏళ్ళ వయసులో కరోల్ ఆ పాపను ఇంటి నుండి బయటకు గెంటేసింది. ఆ పరిస్థితిలో యూనివర్సిటీ క్యాంపస్ లో నివసించింది.

Husband: వీడు మనిషా..? రాక్షసుడా..? ఏడాదిన్నర కూతురిని చంపి.. పాప మృతదేహం పక్కనే హాయిగా నిద్రపోయి..!



2016లో కరోల్ మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆమెకు సంబంధించిన వస్తువులు వెతుకుతుండగా అందులో మహోగని దత్తతకు సంబంధించిన కాగితం దొరికింది. ఆ కాగితంలో ఉన్న విషయాల ఆధారంగా కరోల్ మోసపూరితంగా మహోగనిని దత్తత తీసుకున్నట్టు స్పష్టమైంది. మహోగని చిన్ననాటి పేరు రాఖీ అని తను లక్నో నుండి దత్తతతీసుకోబడ్డానని తెలుసుకున్న తరువాత ఎలాగైనా తన కన్నతల్లిదండ్రులను కలుసుకోవాలని నిర్ణయించుకుంది. తను సంపాదించే డబ్బును జాగ్రత్తగా దాచుకుంది. 20ఏళ్ళ వయసులో తన పేరును మహోగని ఎంబైర్కె గా మార్చుకుంది. ఆమె స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ అయిన కిస్టోపర్ సహాయంతో లక్నోకు వచ్చింది. లక్నోలో ఒక క్యాబ్ మాట్లాడుకుని తన కన్న తల్లిదండ్రుల కోసం వెతుకుతూనే ఉంది. తనును దత్తత ఇచ్చిన అనాథాశ్రమంలో విచారించగా చిన్ననాడు తను తప్పిపోయినప్పుడు తన భుజానికి ఒక బ్యాగు ఉందని, అందులో ఉన్న వివరాల ప్రకారం తన పేరు రాఖీ అని తెలుసుకుంది.

రాఖీ అలియాస్ మహోగని తన తల్లిదండ్రుల కోసం చేస్తున్న ప్రయత్నం క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ప్రయత్నం గురించి తెలిసిన లక్నో జిల్లా ప్రొబెషన్ అధికారి వికాస్ సింగ్ మాట్లాడుతూ 'మేము మహోగనికి సాధ్యమైన సహాయాన్ని అందిస్తాము, ఆమె దత్తతకు వెళ్లిన కాలంలో ఇప్పుడున్న రూల్స్ లేవు. అప్పుడు చాలా లొసుగులు ఉండేవి. దీంతో సమాచారం ఆశించినంత అందుబాటులో లేదు' అని అన్నారు. కాగా మహోగని తన కన్నతల్లిదండ్రుల కోసం చేస్తున్న ప్రయత్నం అక్టోబర్ 9 వరకే అని, ఆ తరువాత ఆమె వీసా గడువు కారణంగా ఆమె తిరిగి యుఎస్ వెళ్లిపోవాల్సి ఉందని తెలిసింది. ఆ లోపు ఆమె తల్లిదండ్రుల జాడ దొరికితే ఎంతో సంతోషంతో వారిని కూడా యుఎస్ కు తీసుకెళతానని చెప్పుకొచ్చింది.

Coconut Game: ఇదేం ఆటరా నాయనా..? కొబ్బరి కాయలను పగలగొట్టేందుకు ఇంత రిస్క్ చేయాలా..?


Updated Date - 2023-09-28T16:21:10+05:30 IST