Viral Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో.. పుట్టీ పుట్టగానే ఈ సింహం పిల్ల ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2023-09-12T12:57:31+05:30 IST
పుట్టీ పుట్టగానే ఈ సింహం పిల్లకు ఉక్రోషం పొడుచుకొచ్చినట్టుంది. అది చేసిన పని చూస్తే..
జంతువులకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వేటకు సంబంధించినవి కాగా మరికొన్ని జంతువులు తమలో తాము పోట్లాడుకునేవి. ఇంకొన్ని జంతువులలో ఉన్న వింత ప్రవర్తనలకు సంబంధించినవి ఉంటాయి. అయితే ఇప్పుడు సింహం పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టీ పుట్టగానే దానికి ఉక్రోషం పొడుచుకొచ్చినట్టుంది. ఆ సింహం పిల్ల చేసిన వని చూస్తే అప్రయత్నంగానే నవ్వు రావడం ఖాయం. సింహం పిల్లను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
అడవికి రాజుగా సింహాన్ని(forest king lion) చెబుతారు. వేటలోనూ, ప్రవర్తనలోనూ సింహం(Lion) చాలా హుందాగా ఉంటుంది. సింహం గర్జన(Lion roar) వింటే గుండె ఆగి చస్తారని చెబుతారు. దానికి తగినట్టే సింహం గట్టిగా గర్జిస్తే 8కిమీ ల దూరం వరకు వినిపిస్తుంది. అంత శక్తివంతంగా ఉంటుంది దాని గొంతు. సింహాలు ప్రధాన పాత్రలుగా వచ్చిన లయన్ కింగ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో అప్పుడే పుట్టిన బుల్లి సింహం పిల్లలు చాలా ముద్దుగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో ఆ సింహం పిల్లల్ని గుర్తుకు తెస్తోంది. వీడియోలో అప్పుడే పుట్టిన ఓ సింహం పిల్ల(Lion cub) మెల్లగా అడుగులు వేసుకుంటూ నడవడం చూడచ్చు. అది మెల్లగా నడుస్తూనే తనలో శక్తిని అంతా కూడదీసుకుని గర్జించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గర్జించడం దానివల్ల కాలేదు. దీంతో అది మళ్లీ తనలో శక్తినే కాదు లేని ఉక్రోషం తెచ్చిపెట్టుకుని మరీ గర్జిస్తుంది. గంభీరమైన సింహంలా, గట్టిగా గర్జించడానికి అది చేస్తున్న ప్రయత్నం చూస్తే అప్రయత్నంగానే నవ్వు రావడం ఖాయం. అంతలోనే జంతువులు అన్ని విషయాలు సహజంగా ఎలా నేర్చుకుంటున్నాయో కదా అనే ఆలోచన కూడా కలుగుతుంది.
Cow vs Snake: ఈ పామును ఆవు తినేసిందా..? లేక సర్పమే ఆవును కాటేసిందా..? ఏం జరిగిందో మీరే చూడండి..!
ఈ వీడియోను Science girl అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'సింహం పిల్ల గర్జించడానికి ప్రాక్టీస్ చేస్తోంది' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ముద్దుగా, అమాయకంగా ఉన్న ఆ సింహం పిల్లను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి కామెంట్స్ చేస్తున్నారు. 'అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించడానికి ముందు సింహం పిల్ల గర్వంగా గర్జించడానకి ప్రయత్నిస్తోంది' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'తల్లి గర్బంలో నుండి అడవి ప్రపంచంలోకి అడుగు పెట్టానని అందరికీ చెబుతోంది' అంటూ మరొకరు కామెంట్ కామెంట్ చేశారు.