Ranchi: రిమ్స్‌లో మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది...
ABN , First Publish Date - 2023-05-23T08:31:37+05:30 IST
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ రిమ్స్‌లో ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు...
రాంచీ(జార్ఖండ్):జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ రిమ్స్‌లో ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు.(Woman gives birth) ఐదుగురు శిశువులు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారని, వారిని పరిశీలన కోసం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంచామని వైద్యులు వివరించారు.‘‘చాటర్‌కు చెందిన ఒక మహిళ రిమ్స్ లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులు ఎన్ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు’’ అని రాంచీ రిమ్స్(RIMS Ranchi) తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాసింది.