Viral: విమానం టేకాఫ్ అవుతుండగా ఊహించని ఘటన!
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:56 PM
విమానంలో ప్రయాణికులు సీటు అకస్మా్త్తుగా వెనక్కు వాలడంతో వారు ఉక్కిరిబిక్కిర అయ్యారు. టేకాఫ్ సందర్భంగా ఇలా జరగడంతో తనకు గుండె పొటు వచ్చినంత పనైందని ఓ వ్యక్తి నెట్టింట వీడియో పెట్టాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బస్సుల్లో పాడైన సీట్లు కనిపిస్తుంటాయి. కానీ విమానంలో సీట్లు పాడవడం మామూలు విషయం కాదు. ఒక్కోసారి ఇది ప్రాణాలకే ముప్పు తేవచ్చు. ఇలాంటి ఓ షాకింగ్ ఘటన తాజాగా ఇండిగోలో వెలుగు చూసింది. ఇలా జరగుతుందని అస్సలు ఊహించని ఓ ప్యాసెంజర్‌కు గుండెపోటు వచ్చినంత పనైందని కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
దక్ష రాఠీ అనే ఇండిగో ప్రయాణికుడికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. దీంతో, అతడు సంస్థను విమర్శిస్తూ నెట్టింట వీడియో పంచుకున్నారు. తనతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఒకే వరుసలో ఉన్న సీట్లలో కూర్చొన్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. విమానం టేకాఫ్ అవుతుండగా ఆ వరుసలో తాము కూర్చొన్న సీట్లన్నీ ఒక్కసారిగా వెనక్కు వాలిపోయాయని చెప్పుకొచ్చాడు.
Also Read: జీవితంలో ఒత్తిడిని జయించాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి
టేకాఫ్ సందర్భంగా విమానం గాల్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడంతో తనకు గుండె ఆగినంతపనైందని అన్నాడు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాక క్షణకాలం పాటు బిత్తరపోయానని అన్నాడు. అదో భయానక అనుభవమని చెప్పుకొచ్చాడు. విమానం టేకాఫ్ అవుతున్న తరుణంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉండగా ఇలా జరగడంతో ఒక్కసారిగా షాకైపోయానని చెప్పుకొచ్చారు. అలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని కూడా చెప్పుకొచ్చారు. సీట్లు వెనక్కూ ముందుకూ ఊయల లాగా ఊగాయని అన్నారు.
‘‘ఇది వినడానికి పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు కానీ వృద్ధులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్లకు మాత్రం ఇబ్బందికరం’’ అని వ్యాఖ్యానించాడు.
Also Read: సునీత విలియమ్స్ శాలరీ.. అంతరిక్షంలో ఓవర్ టైం.. పరిహారం ఎంతంటే..
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన ఎయిర్‌లైన్స్ సంస్థ సేఠీకి క్షమాపణలు చెప్పింది. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాము. ఇదో అసాధారణమైన ఘటనన ఇలా జరగకుండా ఉండేందుకు సీట్లల్లో లాకింగ్ వ్యవస్థ ఉంటుంది’’ అని ఇండిగో కామెంట్ చేసింది. ఈ విషయంలో ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, సమస్యపై లోతైన విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. ఇక జనాలు మాత్రం రకరకాల కామెంట్స్ చేసారు. ఇది బస్సా లేక విమానమా ఇలాంటి దారుణం మరెక్కడా ఉండదేమో అని అనేక మంది వ్యాఖ్యానించారు.
Also Read: హాలీవుడ్ స్టార్ ఇంట్లో డిన్నర్ పార్టీ.. ఏ భారతీయ వంటకాలు సిద్ధం చేశారో చూస్తే.