Viral: ఇదేంటి..? ఇలా ఉందని అవాక్కవుతున్నారా..? అసలు దీన్ని దేనితో తయారు చేశారో తెలిస్తే మరింత షాక్..!

ABN , First Publish Date - 2023-07-26T15:05:19+05:30 IST

కొందరికి ఎవరికీ రాని ఆలోచనలు వస్తుంటాయి. వచ్చిన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల వింత వింత వాహనాలను తయారు చేసిన వారిని చూశాం, అలాగే వినూత్న విన్యాసాలు చేస్తూ...

Viral: ఇదేంటి..? ఇలా ఉందని అవాక్కవుతున్నారా..? అసలు దీన్ని దేనితో తయారు చేశారో తెలిస్తే మరింత షాక్..!

కొందరికి ఎవరికీ రాని ఆలోచనలు వస్తుంటాయి. వచ్చిన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల వింత వింత వాహనాలను తయారు చేసిన వారిని చూశాం, అలాగే వినూత్న విన్యాసాలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న వారిని కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఓ మహిళకు వచ్చిన వింత ఆలోచన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వస్తువును చూసి అంతా అవాక్కవుతున్నారు. అసలు దీన్ని దేనితో తయారు చేశారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. యూకేకి చెందిన 52 ఏళ్ల కేటీ టేలర్ అనే మహిళ (UK woman) ఒకప్పుడు అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉండేది. ఈమెకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత 2004లో ఉన్నట్టుండి టైప్-2 మధుమేహం (diabetes) ఉన్నట్లు తేలింది. దీనివల్ల కేటీ ఊహించనంతగా బరువు పెరిగింది. ఈమె వృత్తిపరగా కళాకారిణి కావడంతో వెంటనే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కీటో డైట్, వెయిట్ లిఫ్టింగ్ చేసింది. అయితే బరువు తగ్గిన తర్వాత వదులుగా ఉన్న చర్మాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స (Skin removal surgery) చేయాల్సి వచ్చింది. చివరకు వైద్యులు సుమారు 1.8 కిలోల బరువున్న చర్మాన్ని తొలగించారు.

Viral: హైకోర్టు ముందుకు అరుదైన కేసు.. మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాక.. ఆ భార్య చేసిన నిర్వాకంతో..!

women-skin.jpg

అయితే చర్మం తొలగించిన తర్వాత కేటీకి.. తన చర్మాన్ని తోలు వస్తువులా మార్చాలనే వింత ఆలోచన వచ్చింది. ఇందుకోసం ఆమె తన స్నేహితుడి సాయం తీసుకుంది. అతడు ముందుగా ఆమె చర్మాన్ని సెలైన్ ద్రావణంలో ముంచి, 9నెలల పాటు ఫ్రీజర్‌లో పెట్టాడు. అనంతరం చర్మాన్ని (Leather skin) లెదర్‌లా మార్చేందుకు.. అందులోని కొవ్వును వేరు చేశారు. చివరగా దాన్ని మరోసారి.. తోలును లెదర్‌లా మార్చే ప్రత్యేక ద్రావణంలో నానబెట్టారు. ఇలా చివరకు కేటీ చర్మం.. లెదర్ వస్తువులా మారిపోయిందన్నమాట. ఈ తోలును భవిష్యత్తులో ఆమె వేలం వేయాలని చూస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ఫొటో (Viral photo) నెట్టింట తెగ వైరల్ వస్తోంది. ‘‘అరె! ఇది మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది మనిషి తోలు బెల్టు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహం ముందే దూడను కొమ్ములతో ఎత్తిపడేసిన తల్లి గేదె.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-07-26T15:12:16+05:30 IST