Viral Video: ఇతడు చపాతీ పిండితో చేసిన విన్యాసం చూస్తే ఖంగుతినడం ఖాయం.. వీడియో చూస్తేగానీ నమ్మలేరు..

ABN , First Publish Date - 2023-04-27T15:55:53+05:30 IST

చాలా మంది తమ రోజు వారీ పనులను అందరిలా కాకుండా భిన్నంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు తమలోని టాలెంట్‌ని జోడించి పనులు చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంటారు. ప్రస్తుతం..

Viral Video: ఇతడు చపాతీ పిండితో చేసిన విన్యాసం చూస్తే ఖంగుతినడం ఖాయం.. వీడియో చూస్తేగానీ నమ్మలేరు..

చాలా మంది తమ రోజు వారీ పనులను అందరిలా కాకుండా భిన్నంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు తమలోని టాలెంట్‌ని జోడించి పనులు చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంటారు. ప్రస్తుతం ఓ వ్యక్తి చపాతీ పిండితో చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చపాతీ పిండిని ఆకాశంలోకి ఎగరేసి మరీ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతో కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ హోటల్ వద్ద యువకుడు చపాతీ (Chapati) చేసేందుకు పిండి సిద్ధం చేసుకుంటాడు. తర్వాత దాన్ని గుండ్రంగా చేసి పెనంపై వేసే ముందు వివిధ రకాల విన్యాసాలు (Stunts) చేస్తాడు. ముందుగా పిండిని ఒక రౌండ్ తిప్పి అనంతరం అమాంతం గాల్లోకి విసిరేస్తాడు. చాలా ఎత్తుకు వెళ్లిన చపాతీ పిండి ఆశ్చర్యకరంగా తిరిగి మళ్లీ తన చేతిలోకి వచ్చి చేరుతుంది. దాన్ని పట్టుకుని మళ్లీ రెండు చేతులతో కాసేపు గాల్లో ఎగరేస్తూ మ్యాజిక్ చేస్తాడు. మధ్య మధ్యలో దాన్ని వేలితో చత్రం తిప్పినట్లు గిరగిరా తిప్పేస్తాడు.

Viral Vdeo: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

చివరగా ఒక చేత్తో వెనక్కు విసిరి, రెండో చేత్తో పట్టుకోవడం.. ఇలా వివిధ రకాలుగా విన్యాసాలు చేస్తాడు. ఇతడు విన్యాసాలు చేస్తుంటే పక్కన ఉన్న వారంతా నోరెళ్లబెట్టి చూస్తుంటారు. చివరగా, వావ్! అద్భుతం.. అంటూ అతన్ని అభినందిస్తారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదేమన్నా రాకెట్ అనుకున్నావా.. అలా గాల్లోకి విసిరేశావ్’’.. అంటూ కొందరు, ‘‘సూపర్! మా కళ్లను మేమే నమ్మలేకున్నాం’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఓ కుర్రాడి ఆఫర్.. చివరకు..!

Updated Date - 2023-04-28T21:04:46+05:30 IST