ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2023-05-30T23:05:06+05:30 IST
జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఆసిఫాబాద్, మే 30: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్, శ్రీనివాస్, రాజేందర్, సుధాకర్, తిరుపతి, స్వరూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్‌లో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ నాయకులు అంగల శ్రీనివాస్ జెండా ఆవిష్క రించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ 53 ఏళ్ల క్రితం సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. సమష్టి కృషి ద్వారా ఉద్యోగ, కార్మికుల హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్, సుధాకర్, రవి, నితీష్ తదితరులు పాల్గొన్నారు.