నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు

ABN , First Publish Date - 2023-05-20T00:52:13+05:30 IST

హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి చింతపల్లి మండల కేంద్రంలో నిర్మించిన శ్రీ షిర్డీసాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవాలకు దే వాలయం ముస్తాబైంది.

 నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు
చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం

నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయకమిటీ సభ్యులు

చింతపల్లి, మే 19: హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి చింతపల్లి మండల కేంద్రంలో నిర్మించిన శ్రీ షిర్డీసాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవాలకు దే వాలయం ముస్తాబైంది. ఈ నెల 20 నుంచి 22 వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించా రు. ఈ దేవాలయం రెండు ఎకరాల స్థలంలో నిర్మించారు. 16ఏళ్ల క్రితం రాజస్థాన రాష్ట్రంలోని జైపూర్‌ నుంచి సాయిబాబా మూల విరాట్‌ను తీసుకువచ్చి ఇక్క డ ప్రతిష్టించారు. ఆలయంలో వినాయకుడి విగ్రహంతో పాటు నందీశ్వరుడు, స రస్వతిదేవి, దత్తాత్రేయస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గురు, ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ని ర్వహిస్తున్నారు. దేవాలయానికి ఆనుకొని గోశాల ఏర్పాటు చేయడంతో దాతల స హకారంతో 300 ఆవులు కూడా ఉన్నాయి. మూడు రోజుల పాటు సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన మంచికంటి ధనుంజయ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-05-20T00:52:13+05:30 IST