Share News

ఖతర్నాక్ స్కూలు టీచర్..ముద్దుకు 50 వేలు కావాలట..

ABN , Publish Date - Apr 01 , 2025 | 10:02 AM

Bengaluru: పిల్లలను స్కూల్లో దించడానికి వచ్చే రాకేష్‌తో ఆమె పరిచయం పెంచుకుంది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ కలిసి తిరగటం మొదలెట్టారు. ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడేవారు. ఓ రోజు శ్రీదేవి ఇచ్చిన షాక్‌కు రాకేష్ మతి పోయింది.

ఖతర్నాక్ స్కూలు టీచర్..ముద్దుకు 50 వేలు కావాలట..
Bengaluru News

ఓ లేడీ టీచర్ డబ్బు కోసం బరితెగించింది. తన స్కూలుకు చదువుకోవడానికి వచ్చే పిల్లల తండ్రిని ట్రాప్ చేసింది. అతడితో సాన్నిహిత్యంగా ఉండి అడ్డంగా ముంచింది. ఆ పిల్లల తండ్రిని ముద్దు పెట్టుకుని.. ఒక ముద్దుకు 50 వేల రూపాయలు డిమాండ్ చేసింది. అంతటితో ఆగకుండా అతడి వద్దనుంచి లక్షల రూపాయలు కాజేసింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన శ్రీదేవీ రుడిగి మహాలక్ష్మీ లే అవుట్‌లోని ఓ ప్రీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. 2023లో శ్రీదేవికి రాకేష్ అనే వ్యక్తితో పరిచయం అయింది. రాకేష్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్నారు.


కాబట్టి పిల్లల కోసం తరచుగా స్కూలుకు వెళ్లేవాడు. కొద్ది కాలానికే పరిచయం ముదిరింది. శ్రీదేవి తన పరిచయాన్ని అడ్డం పెట్టుకుని అతడి వద్దనుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుంది. 2024 మార్చినెలలో తిరిగి ఇస్తానని అంది. కానీ, ఇస్తానన్న టైం దాటిపోయినా తిరిగి ఇవ్వలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని రాకేష్ అడిగాడు. ఆమె ఇవ్వలేనని చెప్పేసింది. అతడితో మరింత చనువుగా ఉండటం మొదలెట్టింది. తరచుగా ఇద్దరూ బయట తిరిగే వారు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునే వారు. కొంతకాలం తర్వాత రాకేష్ తన డబ్బుల ప్రస్తావన తెచ్చాడు. ఈ సారి శ్రీదేవి ప్లేటు ఫిరాయించింది.


‘ మనం ఇన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నాం కదా.. నువ్వు నన్ను చాలా సార్లు ముద్దు పెట్టుకున్నావ్.. ముద్దుకు 50 వేల చొప్పున.. నువ్వే నాకు 15 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేసింది. దీంతో రాకేష్ షాక్ అయ్యాడు. మరుసటి రోజు మరో పెద్ద షాక్ తగిలింది. శ్రీదేవి, రాకేష్‌ను స్కూలుకు పిలిచింది. అతడు వెళ్లాడు. అక్కడ శ్రీదేవితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్లు రాకేష్‌ను బెదిరించారు. ‘ శ్రీదేవికి సాగర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయింది.కానీ, నువ్వు మాత్రం ఆమెతో ఎంజాయ్ చేశావ్. నీ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ..


కోటి రూపాయలు ఇవ్వాలి’ అని అన్నారు. రాకేష్ అంత మొత్తం ఇవ్వలేనని చెప్పాడు. 20 లక్షలకు బేరం కుదిరింది. లక్షన్నర తీసుకుని రాకేష్‌ను అక్కడినుంచి పంపించారు. తర్వాతి నుంచి మిగిలిన డబ్బుల కోసం టార్చర్ చేయటం మొదలెట్టారు. దీంతో రాకేష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముగ్గర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Sunita Williams: సునీత విలియమ్స్ తొలి పత్రికా సమావేశం.. భారత్‌పై ఆసక్తికర కామెంట్స్

Woman Funny Viral Video: అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చపాతీలు చేస్తున్న యువతి నిర్వాకం చూస్తే..

Updated Date - Apr 01 , 2025 | 10:04 AM