Waqf Act: వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:11 AM
సోమవారం సైదాబాద్‌లో వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. ఈద్ ప్రార్థనల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సైదాబాద్/మదీన, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం సైదాబాద్‌లో ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. ఈద్ ప్రార్థనల అనంతరం చేతులకునల్లబ్యాండులు కట్టుకుని, పకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మతాలవారీగా చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. వక్ఫ్ భూములను కాజేయడానికి కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీరాలం ప్రాంతంలోనూ ముస్లింలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రార్థనలకన్నా ముందు మీరాలం ఈద్గాలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News