Gaddar Passes Away : గద్దర్‌కు గుండె ఆపరేషన్ సక్సెస్ అయినా ఎలా చనిపోయారు..!?

ABN , First Publish Date - 2023-08-06T16:30:49+05:30 IST

ప్రజా యుద్ధ నౌక మూగబోయింది.. ఉద్యమ గళం ఊపిరి ఆగింది.. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు!. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండ్రోజుల కిందటే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) గుండె ఆపరేషన్ (Heart Operation) సక్సెస్ అయ్యిందని కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. రెండు మూడ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవారు..!

Gaddar Passes Away : గద్దర్‌కు గుండె ఆపరేషన్ సక్సెస్ అయినా ఎలా చనిపోయారు..!?

ప్రజా యుద్ధ నౌక మూగబోయింది.. ఉద్యమ గళం ఊపిరి ఆగింది.. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు!. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండ్రోజుల కిందటే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) గుండె ఆపరేషన్ (Heart Operation) సక్సెస్ అయ్యిందని కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. రెండు మూడ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవారు..! ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. అయితే గుండె ఆపరేషన్ సక్సెస్ అయినా.. ఎలా చనిపోయారు..? రెండ్రోజుల క్రితమే అనారోగ్యం నుంచి కోలుకున్నారు.. అన్నీ సవ్యంగానే సాగాయి కదా..? ఇంత సడన్‌గా ఎలా చనిపోయారు..? ఇప్పుడీ ప్రశ్నలే జనాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే గద్దర్ ఏ కండీషన్‌లో ఆస్పత్రిలో చేరారు..? ఎలా చనిపోయారు..? అనే విషయాలపై అపోలో డాక్టర్లు (Apollo Doctors) ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.


డాక్టర్లు ఏం చెప్పారు..?

గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-03న బైపాస్ సర్జరీ చేశాము. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారుఅని అపోలో డాక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఐసీయూలోనూ పాట!

మరోవైపు.. కుటుంబీకులు కూడా ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయిఅని గద్దర్ కుటుంబీకులు మీడియాకు వెల్లడించారు. అయితే.. తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్యం రగిల్చిన గద్దర్.. చివరి క్షణాల్లో కూడా పాటను వదల్లేదు. అపోలో ఐసీయూలోనూ పాటలు పాడారని మీడియాకు చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. గద్దర్ సాహిత్యాన్ని, స్వరాన్ని ఎన్నటికీ మరువలేమని ప్రజా సంఘాలు, విప్లవకారులు, ప్రముఖులు ఎమోషన్ అవుతున్నారు. గద్దర్ మరణంతో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రజానీకం, విప్లవకారులు, ఉద్యమకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గద్దర్‌కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Apollo-Doctors-On-Gaddar.jpg

విప్లవ స్పూర్తి!

ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రజా కవి- గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ గారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం’ అని జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Fans.jpg

ప్రశ్నించే స్వరం మూగబోయింది!

గద్దర్ మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) సంతాపం తెలిపారు. ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి బాధించింది. ప్రజా ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో ప్రశ్నించే స్వరం మూగబోయింది. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువ లేనిది’ అని బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే..!’ అని ప్రజా గాయకుడి మరణంపై లోకేష్ ట్వీట్ చేశారు.

Untitled-8.jpg

Updated Date - 2023-08-06T17:04:22+05:30 IST