Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులను ప్రోత్సహించదు
ABN , First Publish Date - 2023-10-31T13:56:21+05:30 IST
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Kota Prabhakar Reddy ) మీద జరిగిన దాడిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) స్పందించారు.
హైదరాబాద్: ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Kota Prabhakar Reddy ) మీద జరిగిన దాడిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) స్పందించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ...‘‘దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభాకర్‌రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్సలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశాడో సమగ్ర విచారణ చేసి నిజానిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేస్తుంది. దర్యాప్తు సంస్థలు, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా దుబ్బాక బందుకు ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది. బందుకు ఎవరైనా పిలుపునిస్తారు. బంద్ దేనికోసం? మీ పాలన పైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? దాడిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ అంటేనే అహింస పార్టీ ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.