Share News

Bhatti Vikramarka : కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి

ABN , First Publish Date - 2023-11-03T17:24:25+05:30 IST

కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు.

Bhatti Vikramarka :  కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి

హైదరాబాద్ : కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ...‘‘పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి. బలహీనమైన వర్గ ప్రజలు ఏమైనా పర్వాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటుంది. దళిత, గిరిజన, మైనార్టీ బలహీన వర్గాలు 92 శాతం రాష్ట్రంలో ఉన్నారు. మీరు సీఎం కావడానికి మొదటగా దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ కలల ప్రపంచం సృష్టించారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామన్నారు. ఇవేమీ ఇవ్వలేదు. బడ్జెట్‌లో 17,700 కోట్లు లెక్కలు చూపించారు. కనీసం 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో రమాకాంత్ బోధ్ మండలంలో దళిత బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. నా ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణామంటుూ లేఖ రాసి చనిపోయారు. రాజ్యాధికారం కోసం కేసీఆర్ ఎన్ని లక్షల మంది జీవీతాలతో ఆడుకుంటావ్. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదు ’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

ఇకపైనా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు

‘‘తెలంగాణ కోసం కన్నా కలలు నెరేవేరలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీ కలలను నిజం చేస్తుంది. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ తీసుకొస్తామని ఏఐసీపీ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. దళిత గిరిజన కుటుంబాలకు విజ్ఞప్తి.. ఇకపైనా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం. రమాకాంత్ సూసైడ్ నోట్‌పై విచారణ జరిపించాలి. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి, కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Updated Date - 2023-11-03T17:24:32+05:30 IST