Share News

Watch Video: కేటీఆర్‌‌‌కు తప్పిన ప్రమాదం.. ర్యాలీలో ముందుకు జారిపడిన మంత్రి

ABN , First Publish Date - 2023-11-09T15:09:56+05:30 IST

Telangana Elections : తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు స్వల్పగాయాలయ్యాయి. గురువారం నాడు ఆర్మూరు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అయితే.. ‘ప్రచార రథం’ వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ ఊడిపోయింది..

Watch Video: కేటీఆర్‌‌‌కు తప్పిన ప్రమాదం.. ర్యాలీలో ముందుకు జారిపడిన మంత్రి

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు స్వల్పగాయాలయ్యాయి. గురువారం నాడు ఆర్మూరు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అయితే.. ‘ప్రచార రథం’ వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో మంత్రి కేటీఆర్ ముందుకు జారారు. మరోవైపు.. సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి వాహనం పైనుంచి పూర్తిగా కిందపడిపోయారు.


KTR-Accident.jpg

ప్రమాదం ఎలా జరిగింది..?

వందల మంది అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ వేయాలని జీవన్ రెడ్డి భావించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు బాగా దగ్గర వ్యక్తి అనే విషయం తెలిసిందే. దీంతో ఈ నామినేషన్ ప్రక్రియకు కేటీఆర్ హాజరయ్యారు. ‘ప్రచార రథం’పై అభ్యర్థి జీవన్ రెడ్డి, కేటీఆర్, సురేష్ రెడ్డి.. ఇంకా కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. భారీ ర్యాలీ కావడంతో, వాహనం ముందు వైపు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాహనాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవర్ తోలుతున్నాడు. ఇంతలో కార్యకర్తల తాకిడి, ముందు వెళ్తున్న వాహనం అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వాహనానికి పైనున్న గ్రిల్ ఊడిపోయింది. కేటీఆర్ ముందుకు ఒరిగిపడగా.. జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి ఇద్దరూ పైనుంచి కింద పడిపోయారు. ఈ ముగ్గురికీ స్వల్పగాయాలయ్యాయి. సడన్ బ్రేక్ వల్లే ఈ ఘటన జరిగిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

KTR-Armor.jpg

అంతా ఓకే కూల్!!

ఈ ఘటనపై కేటీఆర్, సురేష్ రెడ్డి స్పందించారు. సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. అందరం సురక్షితంగా బయటపడ్డాం ఎవరికీ ఏమీ కాలేదన్నారు. మరోవైపు కేటీఆర్ కూడా స్పందిస్తూ.. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని అభిమానులు, పార్టీ శ్రేణులను కోరారు. ప్రమాదం అనంతరం ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ముగియగానే కొడంగల్ రోడ్‌ షోకు కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. కేటీఆర్, సురేష్ రెడ్డి స్పందనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త ఆందోళన తగ్గినట్లయ్యింది. మరోవైపు.. పలువురు పార్టీ ముఖ్యనేతలు స్వయంగా కేటీఆర్, జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు.

Updated Date - 2023-11-09T15:53:36+05:30 IST