Share News

TS Elections: 2023 ఎన్నికలు నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత

ABN , First Publish Date - 2023-12-01T13:34:07+05:30 IST

2023 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును అధికారులు పట్టుకున్నారు. రికార్డ్ స్థాయిలో రూ. 756 కోట్లను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఎన్నికల కోడ్‌లో ఐటీ, ఈడీ, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. పెద్దగా అధికార పార్టీ కి చెందిన నగదు సీజ్ కాకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు.

TS Elections: 2023 ఎన్నికలు నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్ : 2023 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును అధికారులు పట్టుకున్నారు. రికార్డ్ స్థాయిలో రూ. 756 కోట్లను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఎన్నికల కోడ్‌లో ఐటీ, ఈడీ, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. పెద్దగా అధికార పార్టీ కి చెందిన నగదు సీజ్ కాకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 226 మంది అభ్యర్థులపై క్రమినల్ కేసులు నమోదయ్యాయి.

119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 360 మంది అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 78 మంది క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థులతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 58 మందిపై కేసులు నమోదయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసు ఉన్నట్టు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. 2018 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2023 నాటి ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యక్తిగతంగా ఎక్కువ కేసులు ఉన్న నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

Updated Date - 2023-12-01T13:34:09+05:30 IST