PM MODI: కేసీఆర్ తనకి ఆదాయంగా మార్చుకోవడానికే ప్రాజెక్టులు కట్టి నీళ్లను మళ్లించారు
ABN , First Publish Date - 2023-11-26T17:49:01+05:30 IST
తూప్రాన్ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ గెలవలేకే.. ఓటమి భయంతో వేరే చోట పోటీ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.

మెదక్ జిల్లా: తూప్రాన్ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ గెలవలేకే.. ఓటమి భయంతో వేరే చోట పోటీ చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని, ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా, ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా అని, ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్‌ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా అని, సీఎం కేసీఆర్‌పై రైతులు కోపంగా ఉన్నారని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్ని అబద్ధపు హామీలని, ఆయన్ని దేవుడు కూడా క్షమించడని, కేసీఆర్ దళిత సీఎం అని మోసం చేశారన్నారు. దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారని, తెలంగాణ నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోదీ ఆరోపించారు.
"తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు. ఇక సినిమా చూస్తారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం. నవంబర్ 26 ఘటనాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుంది. ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓటమి భయంతో కేసీఆర్ వేరే చోటికి వెళ్లారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారు. ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా. ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా. సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా. సీఎం కేసీఆర్‌పై రైతులు కోపంగా ఉన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారు. కేసీఆర్ వి అన్ని అబద్ధపు హామీలు...ఆయన్ని దేవుడు కూడా క్షమించడు. కేసీఆర్ దళిత సీఎం అని మోసం చేశారు." అని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారు. తెలంగాణ నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా. ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించిన కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలి. కాంగ్రెస్, BRS పార్టీలు రెండు ఒక్కటే. ఈ రెండు పార్టీలు కార్బన్ కాగితాలు లాంటివి. బీజీపీతోనే తెలంగాణ గౌరవం పెరుగుతుంది. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే..ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్, BRS అనే రెండు వ్యాధుల నుంచి తెలంగాణని రక్షించేది బీజేపీనే. కాంగ్రెస్, BRS పార్టీలలో కుటుంబ పాలన కొనసాగుతుంది. ఉమ్మడి కాంగ్రెస్ పాలనలో ఎంతమంది సీఎంలు అయ్యారు. తెలంగాణ వచ్చాక బీసీల్లో ఎవరైనా సీఎం అయ్యారా. తెలంగాణలో బీసీని సీఎం చేసేది బీజేపీ పార్టీనే. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యం. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ గుర్తించింది. ఒక కమిటీ వేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. కాంగ్రెస్, BRS పార్టీలకు పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ సుల్తాన్ లను పెంచి పోషించారు. తెలంగాణలో కేసీఆర్ నిజాం వారసుల్ని పెంచి పోషిస్తున్నారు." అని ప్రధాని మోదీ విమర్శించారు.
"తెలంగాణలో BRS ఎమ్మెల్యేలు పనికి 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ కొనసాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఏర్పడింది. BRS, కాంగ్రెస్ పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు తనకి ఆదాయంగా మార్చుకోవడానికి ప్రాజెక్టు కట్టి నీళ్లను మళ్లించారు. నిధుల విషయంలో దుబారా పెంచి తెలంగాణ ప్రజలపై అప్పు వేసింది. నియామకాల విషయంలో నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణని లూటీ చేసి దేశాన్ని దోచుకోవడానికి దేశ్ కి నేత అంటున్నారు. ఢిల్లీలో ఉన్న అవినీతి పార్టీతో చేయి కలిపి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చేశారు. ఈ కేసులో కొంతమంది జైల్లో ఉన్నారు, బెయిల్ పై బయటికి వచ్చారు. ఈ కేసులో ఎవ్వరిని వదళం, కొంతమంది ఫోన్లు మార్చి డబ్బులు పంపించారు. ఈ కేసులో ఎవ్వరిని వదళం.. ఇది మోడీ గ్యారెంటీ. కేసీఆర్ అయినా, కాంగ్రెస్ అయినా ఇద్దరు కలిసి రైతుల్ని ముంచారు. రైతుల కోసం ఆలోచించింది బీజేపీ పార్టీనే. తెలంగాణలో బీజేపీని గెలిపించండి. బీసీని సీఎం చేస్తాం. మంత్రి మండలిలో అన్ని వర్గాలకు ప్రధాన్యం కల్పిస్తాం." అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.