Revanth Reddy: రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టండి
ABN , First Publish Date - 2023-11-27T13:16:36+05:30 IST
రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి తాము విజ్ఞప్తి చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. డోర్నకల్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన మాట్లాడుతూ... ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల... రైతు బంధు ఆగిందన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని రేవంత్ పేర్కొన్నారు. రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని రైతులకు రేవంత్ విజ్ఞప్తి చేశారు
మహబూబాబాద్: రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి తాము విజ్ఞప్తి చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. డోర్నకల్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన మాట్లాడుతూ... ఈసీ అనుమతి ఇచ్చినా.. హరీష్ రావు నోటిదూల, కేసీఆర్ అతి తెలివి వల్ల... రైతు బంధు ఆగిందన్నారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయాయని రేవంత్ పేర్కొన్నారు. రైతుబంధు రాకపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని రైతులకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. అల్లుడు హరీష్ వల్లే రూ.5వేల కోట్లు ఆగిపోయాయని... దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ అన్నారు. నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దని రేవంత్ పేర్కొన్నారు.