Revanth Reddy: నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి
ABN , First Publish Date - 2023-11-26T17:22:55+05:30 IST
నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.
మహబూబ్‌నగర్: నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. ఆదివారం నాడు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ...‘‘పాలమూరులో యెన్నెం శ్రీనివాస్‌రెడ్డికి 25వేల ఓట్ల మెజారిటీ రావాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు జోలికొస్తే చూస్తూ ఊరుకోం. పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి 14 కు 14 స్థానాల్లో గెలిపించండి. తెలంగాణ రాష్ట్రంలో 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నాది. సీఎం కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు.. పదివేల ఎకరాలు ఆక్రమించుకున్నాడు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సౌమ్యుడు. గతంలో పాలమూరు అభివృద్ధికి కృషి చేశాడు. కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించండి పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి