పల్లెలు, పట్టణాలు అభివృద్ధి : ఎమ్మెల్యే భగత

ABN , First Publish Date - 2023-03-15T00:39:37+05:30 IST

సీఏం కేసీఆర్‌ నా యకత్వంలో పల్లెలు, ప ట్టణాలు అ భివృద్ధి చెం దుతున్నాయని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు.

 పల్లెలు, పట్టణాలు అభివృద్ధి : ఎమ్మెల్యే భగత
నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భగత

పల్లెలు, పట్టణాలు అభివృద్ధి : ఎమ్మెల్యే భగత

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భగత

హాలియా, మార్చి 14: సీఏం కేసీఆర్‌ నా యకత్వంలో పల్లెలు, ప ట్టణాలు అ భివృద్ధి చెం దుతున్నాయని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. మంగళవారం హాలియా మునిసిపాలిటీ 8వ వా ర్డు చిన్నఅనుములలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే నిర్మించే నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గతంలో పాలించిన నాయకులు ప్రజలను ఓటు బ్యాంకుకు తప్ప ఏనాడు వారి గురించి, పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సీఏం కేసీఆర్‌ నాయకత్వంలో హాలియా రూపురేఖలు మారుతున్నాయని, పట్టణంలో చేపడుతున్న పనుల గురించి వివరించారు. అ నంతరం ఎల్లమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

హాలియా మునిసిపాలిటీ 4వ వార్డు ఆకాంక్ష పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే భగత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిబిరం లో నిర్వహిస్తున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్మన ఇరిగి పెద్దులు, మునిసిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన వెంపటి పార్వతమ్మశంకరయ్య, మార్కెట్‌ చైర్మన జవ్వాజి వెంకటేశ్వర్లు, నాయకులు నల్లగొండ సుధాకర్‌, కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు, ఎన్నమల్ల సత్యం, ప్రసాద్‌, లక్ష్మమ్మలంగయ్య, సైదులు, ఈదయ్య, వెంకటయ్య, శ్రీను, ప్రసాద్‌, వెంకన్న, బాలరాజు, సైదాచారి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-15T00:39:37+05:30 IST