Relationship Tips: మీ భార్యను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా.. అద్భుతమైన టిప్స్ మీకోసం..
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:55 PM
Relationship Tips For Husbands: ఇటీవల పెళ్లి తర్వాత ఎక్కువ కాలం బంధాన్ని కొనసాగించలేకపోతున్నారు కపుల్స్. ఇందుకు ఎన్నో రకాల కారణాలు. ఎంత చేసినా భార్య మెప్పు పొందలేకపోతున్నామని భావించే భర్తలు ఓసారి ఈ టిప్స్ పాటించి చూడండి. తర్వాత వచ్చే మార్పు మీకే తెలుస్తుంది.

Relationship Tips For Husbands: భార్యలను సంతోషపెట్టడం అంత సులభం కాదని అందరూ సాధారణంగా అనే మాట. అడిగినవన్నీ చేసిపెడుతున్నా ఏదొక పేచీ పెడుతుంటారని కంప్లైంట్ చేస్తుంటారు భర్తలు. ఇక భరించడం నా వల్ల కాదని బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించరు. ఇంటి వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవారు కొందరైతే..యాంత్రికంగా మిగిలిపోయేవారు మరికొందరు.కపుల్స్ మధ్య సాన్నిహిత్యం దీర్ఘకాలం కొనసాగాలంటే ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు. ఈ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నా భార్యాభర్తల మధ్య సంబంధాలు కలకాలం నిలిచి ఉంటాయి. భార్య హృదయాన్ని గెల్చుకునేందుకు భర్తలు పాటించాల్సిన సూత్రాలు ఇవే..
1. సరైన రీతిలో పలకరించండి
రోజూ ఇంట్లోనే ఉంటున్నాం కదా ప్రత్యేకంగా పలకరించడం, బాగోగులు కనుక్కోవడం ఎందుకని అనుకుంటారు చాలామంది. ఇది తప్పు. ప్రేమగా పిలవడం, పనిలో సాయం చేయడం, కలుపుగోలుగా మాట్లాడుతూ ఉల్లాసంగా గడపడం లాంటివి చేయండి. భార్య అసౌకర్యాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించండి.
2. మాట్లాడనివ్వండి
అమ్మాయిలు తమ మాట ఓపికగా వినే అబ్బాయిలను ఇష్టపడతారు. కాబట్టి వారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. వారిని అడ్డుకోకండి. ముఖ్యంగా వారి మాట వినకుండానే మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు ప్రయత్నించకండి. ఈ విధంగా కూడా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు.
3. అబద్ధం చెప్పకండి
ఏ సంబంధానికైనా నమ్మకమే పునాది. ఈ ఒక్క విషయంపై ఆధారపడే ఏ కపుల్స్ బంధమైనా శాశ్వతంగా నిలవడమో లేదా బీటలు వారడమో జరుగుతుంది. కాబట్టి భార్య కోప్పడుతుందనో, ఆకట్టుకోవడానికో అబద్ధం చెప్పకండి. నిజాలు దాచి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీ బంధాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు.
4. సరదాగా గడపండి
ఎప్పుడూ ఏదో బిజీ పనంటూ ప్రతి విషయంలో భార్యకు సీరియస్‌గా జవాబివ్వడం సరికాదు. వీలైనప్పుడల్లా సరదాగా జోకులు వేస్తూ ఆమెను నవ్వించండి. సంభాషించేటప్పుడు భార్యకు నచ్చని విషయాలను అదేపనిగా ప్రస్తావించకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ కారణంగా ఆమె మనోభావాలు దెబ్బతిని మూడ్ చెడిపోవచ్చు. మీరు ఫన్నీగా మాట్లాడితే అమ్మాయి ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆ సందర్భం బోరింగ్‌గా అనిపించదు.
Read Also: Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..
Coriander Leaves: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి..
Summer Tips: ఎండవేడికి అరచేతుల్లో చెమట పడుతున్నాయా.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్..