Share News

Maoists:వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:07 PM

Maoists: దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో వేలాది మంది మావోయిస్టులు మరణించారు. మరోవైపు వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగి పోతున్నారు. మార్చి 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించే కొద్ది సమయం ముందు దాదాపు 50 మంది మావోస్టులు.. బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన పోలీసులు, భద్రతా దళాలలో ఆత్మస్తైర్యాన్ని నింపింది.

Maoists:వచ్చే ఏడాది సరిగ్గా.. లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్
Operation Kagar

రాయ్‌పూర్, మార్చి 31: దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రాజెక్ట్ సత్ ఫలితాలను ఇస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆదివారం అంటే మార్చి 30వ తేదీన భారీగా అంటే 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదికూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర పర్యటనకు వచ్చే కొద్ది గంటల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో భద్రత దళాల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపింది.


సరిగ్గా ఏడాది నాటికి..

వచ్చే ఏడాది అంటే 2025, మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. అంటే ఈ రోజుకు ఇంకా 365 రోజులు ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నిర్మూలన కోసం పోలీసులు, భద్రత బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌లు చోటు చేసుకొంటున్నాయి. వీటిలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ రోజు వరకు వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.

అలాగే పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య సైతం రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం భారీగా తగ్గింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వీరి ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతోపాటు భద్రత దళాలు రంగంలోకి దిగి మావోయిస్టులను ఏరివేతను చేపట్టాయి. దీంతో ఒకే రోజు పలు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు సైతం చోటు చేసుకొంటున్నాయి. ఇక మావోయిస్టుల్లోని కీలక నేతలంతా ఛత్తీస్‌గఢ్‌లోనే ఆశ్రయం పొందుతున్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో వారే లక్ష్యంగా కూబింగ్ సైతం నిర్వహిస్తున్నారు.


మహారాష్ట్ర సీఎం ఎదుట..

అదీకాక ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌లో వీరంతా లొంగిపోయారు. వారిలో మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ భార్య సైతం ఉన్న సంగతి తెలిసిందే.


అమిత్ షా వార్నింగ్

లొంగిపోవాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులకు సూచించారు. లేకుంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి అదే తుది శాస్వంటూ వారికి హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. అదీకాక..కేంద్ర మంత్రి అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులతోనే కాకుండ.. మావోయిస్టుల వల్ల బాధితులుగా మారిన వారితో సైతం ఆయన వేర్వేరుగా సమాశమైన విషయం విధితమే.


అడవి నుంచి బయటకు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై ఉక్కు పాదం మోపడంతో.. ఆశ్రయం పొందుతోన్న మావోయిస్టులంతా పట్టణ ప్రాంతాలకు తరలి వేళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇంకోవైపు.. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టుల లొంగిపోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Liquor Shops: ఏప్రిల్ 1 నుంచి మద్యం షాపులు బంద్.. ఎందుకంటే..

Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..

Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 06:10 PM