Share News

PM Modi: 2029లోనూ మోదీనే ప్రధాని: సీఎం ఫడ్నవిస్

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:06 PM

మోదీ సెప్టెంబర్‌లో రిటైర్‌మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.

PM Modi: 2029లోనూ మోదీనే ప్రధాని: సీఎం ఫడ్నవిస్

ముంబై: దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఇంకా చాలా ఏళ్లు నాయకత్వం వహిస్తారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) అన్నారు. మోదీకి వారసుడిని అన్వేషించాల్సిన అవసరమే లేదని, 2029లోనూ మోదీని ప్రధానమంత్రిగా మనం చూస్తామని చెప్పారు. మోదీ సెప్టెంబర్‌లో రిటైర్‌మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..


మహారాష్ట్ర నుంచి మోదీ వారసుడు వస్తారంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవిస్ స్పందిస్తూ... ''మోదీనే మా నేత. అలాగే ఆయన కొనసాగుతారు. మన సంస్కృతిలో తండ్రి బతికుండగా వారసుని గురించి మాట్లాడం. అది మొఘలుల సంస్కృతి. దానిపై (మోదీ వారసత్వంపై) చర్చించేందుకు ఇంకా సమయం రాలేదు" అని అన్నారు.


భయ్యాజీ జోషి ఏం చేప్పారంటే?

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను మోదీ కలుసుకోవడం, మహారాష్ట్ర నుంచి మోదీ వారసుడు ప్రధాని కానున్నారనే ఊహాగానాలపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి స్పందించారు. అలాంటి సమాచారం ఏదీ తనవద్ద లేదని, అలాంటి సంభాషణలు జరిగినట్టు కూడా తనకు తెలియదని చెప్పారు. కోవిడ్ సమయంలో మోదీ అందించిన సేవలు, సంఘ్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జయంతికి స్వయంసేవక్‌గా ఆయన హాజరుకావడం చాలా చక్కగా ఉందని ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 06:09 PM