HYD Metro: విద్యార్థులకు శుభవార్త.. ఇక నుంచి మెట్రో రైళ్లలో...

ABN , First Publish Date - 2023-07-01T18:37:31+05:30 IST

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.

HYD Metro: విద్యార్థులకు శుభవార్త.. ఇక నుంచి మెట్రో రైళ్లలో...

హైదరాబాద్ : విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో మెట్రో (Metro) రైళ్లలో విద్యార్థులు ప్రయాణించేందుకు వీలుగా స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. మెట్రో రైళ్లలో విద్యార్థులు ఇక నుంచి హ్యాపీగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లవచ్చు. నేటి నుంచి మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ అందుబాటులోకి తెచ్చినట్లు మెట్రో రైల్వే అధికారులు తెలిపారు. 20 ట్రిప్పుల చార్జీతో 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం కల్పించినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.

షరతులు వర్తిస్తాయి...

  • మెట్రో పాస్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా కొత్తగా బ్రాండ్ చేయబడిన స్మార్ట్ కార్డ్స్ కొనుగోలు చేయాలి.

  • ట్రిప్ పాస్ చెల్లుబాటు కొనుగోలు తేదీ నుంచి 30 రోజుల వరకు పని చేస్తోంది.

  • ఈ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉంటుంది.

  • ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుంది.

  • 1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులు పాస్ పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది.

  • సంస్థ నిర్ణయం ప్రకారం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.

  • విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్ లైన్ - JNTU కళాశాల, SR నగర్, అమీర్‌పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌‌షుఖ్ నగర్ గ్రీన్ లైన్ - నారాయణగూడ, బ్లూ లైన్ - నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్ మరియు రాయదుర్గ్ వద్ద పాస్‌లను కొనుగోలు చేయవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-07-01T19:06:59+05:30 IST