CBN ARREST: చంద్రబాబు కోసం కదిలిన నారీమణులు
ABN , First Publish Date - 2023-10-06T21:01:56+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ‘‘నారా కోసం నారి’’ అనే నినాదంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ కమిటీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి , టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. జ్యోష్న, మాజీ ఎమ్మెల్యే కాటగడ్డ ప్రసూన, దివంగత నందమూరి సాయికృష్ణ సతీమణి మధుమణి, ఆయన కూతురు మనస్విని, నందమూరి కుటుంబ సభ్యులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే కాటగడ్డ ప్రసూన రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా షకీలారెడ్డి(Shakila Reddy) మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ప్రమేయం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు బనాయించారు. ఇటీవల పార్టీకి వచ్చిన 27 కోట్ల ఫండ్ విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ పార్టీకి వచ్చిన ఫండ్‌పై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఎవరెన్నీ కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారితో సుప్రీంకోర్టులో కేసు వేయించి న్యాయపోరాటానికి దిగుతానని కాట్రగడ్డ ప్రసూన హెచ్చరించారు.