జనసంద్రంగా మారిన సారపాక
ABN , First Publish Date - 2023-02-14T23:07:26+05:30 IST
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

బూర్గంపాడు, పిబ్రవరి 14: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పారిశ్రామిక ప్రాంతమైన సారపాక ప్రధాన కూడలి జనసంద్రంగా మారింది. అశ్వాపురం మండలం గొల్లగూడెం నుంచి కాన్వా య్ ద్వారా సారపాకకు చేరుకున్న రేవంత్‌రెడ్డికి ఐటీసీ ఈస్ట్‌గేటు సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరిన రేవంత్‌రెడ్డి తొ లుత సారపాక కూడలీలోని ఎన్టీఆర్ విగ్రహనికి, అనంతరం వైఎస్‌ఆర్, గాంధీజీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సారపాక నుంచి గోదావరి వారధి మీదుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం తరలివెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూశారు. రేవంత్‌రెడ్డి వెంట సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, ములుగు, భద్రాచలం శాసనసభ్యులు సీత క్క, పొదెం వీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మా జీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు బ ట్టా విజయగాంధీ, మారం వెంకటేశ్వర్‌రెడ్డి, యారం పిచ్చిరెడ్డి, భజన సతీష్, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.